మార్కెట్లకు చమురు సెగ

ABN , First Publish Date - 2021-10-07T08:03:33+05:30 IST

ముడి చమురు ధరల సెగలతోపాటు వస్తు సరఫరా అవాంతరాలు ప్రపంచ వృద్ధి పునరుద్ధరణకు ప్రతిబంఽధకాలుగా మారవచ్చన్న భయాలతో గ్లోబల్‌ స్టాక్‌ మార్కెట్లలో...

మార్కెట్లకు చమురు సెగ

సెన్సెక్స్‌ 555 పాయింట్లు డౌన్‌

 రూ.2.58 లక్షల కోట్ల సంపద ఫట్‌  

ముంబై: ముడి చమురు ధరల సెగలతోపాటు వస్తు సరఫరా అవాంతరాలు ప్రపంచ వృద్ధి పునరుద్ధరణకు ప్రతిబంఽధకాలుగా మారవచ్చన్న భయాలతో గ్లోబల్‌ స్టాక్‌ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. దాంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లోనూ రెండు రోజుల ర్యాలీకి బ్రేక్‌పడింది. బుధవారం సెన్సెక్స్‌ 555.15 పాయింట్లు కోల్పోయి 59,189.73 వద్ద క్లోజైంది. నిఫ్టీ 176.30 పాయింట్ల నష్టంతో 17,646 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌ లిస్టెడ్‌ కంపెనీల్లో ఇండ్‌సఇండ్‌ బ్యాంక్‌ అన్నిటికంటే అధికంగా 3.38 శాతం క్షీణించింది. బీఎ్‌సఈలోని అన్ని రంగాల సూచీలు నేలచూపులు చూశాయి. మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు కూడా 1.22 శాతం వరకు నష్టపోయాయి.మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు కూడా 1.22 శాతం వరకు నష్టపోయాయి. అమ్మకాల హోరులో మార్కెట్‌ వర్గాల సంపద రూ.2.58 లక్షల కోట్ల మేర ఆవిరైంది. బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ సంపద రూ.262.20 లక్షల కోట్లకు పరిమితమైంది. 


ఐదున్నర నెలల కనిష్ఠానికి రూపాయి

దేశీయ కరెన్సీ గడిచిన ఆరు నెలల్లో అతిపెద్ద పతనాన్ని చవిచూసింది. అమెరికన్‌ డాలర్‌తో రూపాయి మారకం రేటు ఒక్కరోజులోనే 54 పైసలు బలహీనపడి రూ.74.98కు చేరకుంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 23 (దాదా పు ఐదున్నర నెలలు) తర్వాత రూపాయి మారకం విలువకిదే కనిష్ఠ ముగింపు స్థాయి. అంతర్జాతీయంగా డాలర్‌ బలపడటంతోపాటు ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో పయనించడం, క్రూడ్‌ ధరల పెరుగుదల మన కరెన్సీకి గండికొట్టాయి.

Updated Date - 2021-10-07T08:03:33+05:30 IST