ఆఫీస్ రెంట్స్ ఢమాల్
ABN , First Publish Date - 2021-05-13T05:30:00+05:30 IST
ఈ ఏడాది ఆఫీస్ స్పేస్ డెవలపర్లకు పెద్దగా కలిసొ చ్చే సూచనలు కనిపించడం లేదు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే, ఈ ఏడాది తొలి మూడు నెలల్లో బెంగళూరు, ముంబై, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో

1-8 శాతం తగ్గుదల
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఆఫీస్ స్పేస్ డెవలపర్లకు పెద్దగా కలిసొ చ్చే సూచనలు కనిపించడం లేదు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే, ఈ ఏడాది తొలి మూడు నెలల్లో బెంగళూరు, ముంబై, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఆఫీసులకు వినియోగించే భవనాల్లో అద్దెలు పడిపోయాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే బెంగళూరులో అత్యధికంగా ఎనిమిది శాతం, ఢిల్లీ దాని పరిసర ప్రాంతాల్లో అత్యల్పంగా ఒక శాతం రెంటల్స్ తగ్గాయి. ఆర్థిక రాజధాని ముంబైలోనూ ఇదే పరిస్థితి. అక్కడ ఆఫీసు స్పేస్ రెంటల్స్ ఈ సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 6.2 శాతం తగ్గినట్టు కన్సల్టెన్సీ సంస్థ ‘నైట్ ఫ్రాంక్’ తెలిపింది.
భవిష్యత్ : కొవిడ్ రెండో ఉధృతి నేపథ్యంలో కొంత అనిశ్చితి నెలకొన్నా వచ్చే 12 నెలల్లో ఈ మూడు ప్రధాన నగరాల్లో ఆఫీసు రెంటల్స్ స్థిరంగానే ఉండే అవకాశం ఉందని అంచనా. ఈ రెండో ఉధృతి కారణంగా అమలవుతున్న స్థానిక లాక్‌డౌన్లతో ఇప్పటికే ఆఫీసు స్పేస్‌ను రెంట్‌కు తీసుకున్న సంస్థలు, అక్కడ తమ కార్యకలాపాలు ప్రారంభించలేకపోతున్నట్టు నైట్‌ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజాల్ చెప్పారు.
‘ఫ్లెక్సిబుల్ ’ స్పేస్‌కే డిమాండ్
ఫ్లెక్సిబుల్ ఆఫీసు స్పేస్ డిమాండ్‌కు మాత్రం ఎలాంటి ఢోకా లేదని మరో ప్రాపర్టీ కన్సల్టెన్సీ సీబీఆర్‌ఈ తెలిపింది. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఫ్లెక్సిబుల్ ఆఫీసు స్పేస్ కోసం 3.6 కోట్ల చదరపు అడుగు(ఎ్‌సఎ్‌ఫటీ)ల ఆఫీసు స్థలాల్ని లీజు లేదా రెంట్‌కు తీసుకున్నాయి.