సీటీపీఆర్ తయారీపై నాట్కోకు అడ్డంకి!
ABN , First Publish Date - 2021-07-08T06:52:31+05:30 IST
క్రిమిసంహారిణి క్లోరాన్‌ట్రానిలిప్రోల్‌కు (సీటీపీఆర్) సంబంధించి నాట్కో ఫార్మాకు వ్యతిరేకంగా కాలిఫోర్నియాకు చెందిన ఎఫ్‌ఎంసీ కార్పొరేషన్ దాఖలు చేసిన మధ్యంతర ఇంజెక్షన్ దరఖాస్తును ఢిల్లీ హైకోర్టు స్వీకరించింది.

ఎఫ్‌ఎంసీ ఇంజంక్షన్ దరఖాస్తు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): క్రిమిసంహారిణి క్లోరాన్‌ట్రానిలిప్రోల్‌కు (సీటీపీఆర్) సంబంధించి నాట్కో ఫార్మాకు వ్యతిరేకంగా కాలిఫోర్నియాకు చెందిన ఎఫ్‌ఎంసీ కార్పొరేషన్ దాఖలు చేసిన మధ్యంతర ఇంజెక్షన్ దరఖాస్తును ఢిల్లీ హైకోర్టు స్వీకరించింది. నాట్కో సస్య రక్షణ ఉత్పత్తుల విభాగంలోకి అడు గు పెడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సీటీపీఆర్‌ను దేశీయ మార్కెట్‌లోకి విడుదల చేయాలని నిర్ణయించింది. ఎఫ్‌ఎంసీతో దీనిపై నాట్కోకు న్యాయ వివాదం నడుస్తోంది. సీటీపీఆర్ వినియోగానికి ‘స్వేచ్ఛ’ కల్పించాలని కోరుతూ..2019, సెప్టెంబరులో హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో నాట్కో కేసు వేసింది. ఇది పేటెంట్ నిబంధనల ఉల్లంఘనే అని పేర్కొంటూ.. 2019, నవంబరులో ఎఫ్‌ఎంసీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిచింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో సీటీపీఆర్ టెక్నికల్‌ను దేశీయంగా తయారు చేయడానికి నాట్కోకు సెంట్రల్ ఇన్‌సెక్టిసైడ్ బోర్డు అండ్ రిజిస్ట్రేషన్ కమిటీ అనుమతి ఇచ్చింది. వివిధ పంటల కోసం వినియోగించే క్రిమిసహారక మందుల్లో సీటీపీఆర్ టెక్నికల్‌ను వినియోగిస్తారు. కారోజెన్, ఫెర్‌టెర్రా బ్రాండ్‌లతో ఎఫ్‌ఎంసీ విక్రయిస్తున్న ఉత్పత్తుల్లో దీన్ని వినియోగిస్తోంది. సీటీపీఆర్‌తో తయారు చేసే క్రిమిసంహారక మందులను భారత రైతులకు తక్కువ ధరలకు అందుబాటులోకి తీసుకువచ్చే లక్ష్యంగా సీటీపీఆర్ తయారీ చేపడుతున్నట్లు గతంలో నాట్కో తెలిపింది. ఈ పరిణామాలతో బుధవారం నాట్కో ఫార్మా షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎ్‌సఈలో 6.66 శాతం నష్టంతో రూ.1,087.30 వద్ద క్లోజయ్యాయి.