సరికొత్త గరిష్ఠానికి నిఫ్టీ

ABN , First Publish Date - 2021-08-27T06:39:18+05:30 IST

అంతర్జాతీయ మార్కెట్లలో స్తబ్ధతతోపాటు ఆగస్టు డెరివేటివ్‌ కాంట్రాక్టుల ముగింపు నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం పరిమిత శ్రేణిలోనే కదలాడాయి.

సరికొత్త గరిష్ఠానికి నిఫ్టీ

ముంబై: అంతర్జాతీయ మార్కెట్లలో స్తబ్ధతతోపాటు ఆగస్టు డెరివేటివ్‌ కాంట్రాక్టుల ముగింపు నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం పరిమిత శ్రేణిలోనే కదలాడాయి. వరుసగా రెండో రోజూ ఫ్లాట్‌గా ముగిశాయి. బీఎ్‌సఈ సెన్సెక్స్‌ కేవలం 4.89 పాయింట్ల లాభంతో 55,949.10 వద్ద, ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 2.25 పాయింట్ల పెరుగుదలతో 16,636.90 వద్ద స్థిరపడ్డాయి. అయినప్పటికీ, నిఫ్టీకి ఆల్‌టైం గరిష్ఠ ముగింపు స్థాయి ఇది. సెన్సెక్స్‌ లిస్టెడ్‌ కంపెనీల్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 1.29 శాతం లాభంతో టాప్‌ గెయినర్‌గా నిలిచింది. ఎం అండ్‌ ఎం, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌ కూడా లాభాల్లో పయనించాయి. ఎయిర్‌టెల్‌, మారుతి సుజుకీ, పవర్‌గ్రిడ్‌, ఎస్‌బీఐ, టాటా స్టీల్‌, ఎన్‌టీపీసీ, సన్‌ఫార్మా షేర్లు మాత్రం నేలచూపులు చూశాయి.  

Updated Date - 2021-08-27T06:39:18+05:30 IST