13500 దిగువన మరింత బలహీనం
ABN , First Publish Date - 2021-02-01T06:03:14+05:30 IST
నిఫ్టీ గత వారంలో నాలుగు ట్రేడింగ్ దినాలూ డౌన్‌ట్రెండ్ చవిచూస్తూ 900 పాయింట్ల మేరకు నష్టపోయి వారం కనిష్ఠ స్థాయిలో ముగిసింది. వీక్లీ చార్టుల్లో దిగువకు ఏర్పడిన రివర్సల్ బార్ కన్నా దిగజారి మరింత

నిఫ్టీ గత వారంలో నాలుగు ట్రేడింగ్ దినాలూ డౌన్‌ట్రెండ్ చవిచూస్తూ 900 పాయింట్ల మేరకు నష్టపోయి వారం కనిష్ఠ స్థాయిలో ముగిసింది. వీక్లీ చార్టుల్లో దిగువకు ఏర్పడిన రివర్సల్ బార్ కన్నా దిగజారి మరింత దిగువకు పోతోంది. గత కొద్ది నెలల బుల్లిష్ ట్రెండ్ అనంతరం బలమైన బేరిష్ ట్రెండ్‌లోకి జారుకుంటోంది. తీవ్రమైన ఓవర్‌బాట్ స్థితిని కూడా సద్దుబాటు చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది. సంస్థాగత ఇన్వెస్టర్ల అమ్మకాల కారణంగా భారీ అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటోంది. కేంద్ర బడ్జెట్ పైనే మార్కె ట్ స్వల్పకాలిక దిశ ఆధారపడి ఉంటుంది. 14000 కన్నా దిగువన ముగియడం మరింత అప్రమత్త సంకేతం. ఈ తొలి రౌండ్ కరెక్షన్ అనంతరం సానుకూల ట్రెండ్ కోసం పునరుజ్జీవం తప్పనిసరి. విఫలమైతే రెండో రౌండ్ కరెక్షన్‌లో పడుతుంది. 50 డీఎంఏ కన్నా కూడా దిగువకు రావడం కూడా బలమైన పునరుజ్జీవం తప్పనిసరి అనేందుకు సంకేతం.
బుల్లిష్ స్థాయిలు: మరింత అప్‌ట్రెండ్ కోసం ప్రధాన నిరోధం 14000 కన్నా పైన నిలదొక్కుకుని తీరాలి. స్వల్పకాలిక నిరోధం 14500.
బేరిష్ స్థాయిలు: ప్రధాన మద్దతు స్థాయి 13400 కన్నా దిగజారితే స్వల్పకాలిక బలహీనత చవిచూస్తుంది. మరో ప్రధాన మద్దతు స్థాయి 13000.
బ్యాంక్ నిఫ్టీ: గడిచిన వారంలో ఈ సూచీ 3000 పాయింట్లు దిగజారి 30000 వద్ద మైనర్ రికవరీ సాధించింది. ప్రధాన నిరోధం 13200. ఆ పైన నిలదొక్కుకుం టే తదుపరి టార్గెట్లు 31600, 32000. విఫలమై 30000 కన్నా దిగజారితే మరింత బలహీనపడుతుంది. ప్రధాన మద్దతు స్థాయిలు 29600, 29000.
పాటర్న్: 14500 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన రెసిస్టెన్స్ ట్రెండ్‌లైన్’’ వద్ద గట్టి నిరోధం ఎదురవుతోంది. స్వల్పకాలిక అప్‌ట్రెండ్ కోసం దాన్ని బ్రేక్ చేయాలి. మార్కెట్ 20 డీఎంఏ కన్నా బాగా దిగువన ఉండడం స్వల్పకాలిక బలహీనత సంకేతం.
టైమ్: ఈ సూచీ ప్రకారం మంగళవారం నాడు తదుపరి రివర్సల్ ఉంది.
సోమవారం స్థాయిలు
నిరోధం : 13780, 13850
మద్దతు : 13600, 13480
www.sundartrends.in