నిఫ్టీ ఇండియా డిజిటల్‌ ఇండెక్స్‌

ABN , First Publish Date - 2021-12-15T09:26:53+05:30 IST

నిఫ్టీ ఇండియా డిజిటల్‌ ఇండెక్స్‌

నిఫ్టీ ఇండియా డిజిటల్‌ ఇండెక్స్‌

ముంబై : దేశీయ స్టాక్‌ మార్కెట్లో డిజిటల్‌ కంపెనీల షేర్ల పనితీరునీ ఇక మరింత స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఇందుకోసం సరికొత్త సూచీ అందుబాటులోకి వచ్చింది. ఎన్‌ఎ్‌సఈ అనుబంధ సంస్థ ఎన్‌ఎ్‌సఈ ఇండైసిస్‌ లిమిటెడ్‌ ఇందుకోసం నిఫ్టీ ఇండియా డిజిటల్‌ ఇండెక్స్‌ పేరుతో కొత్త ఇండెక్స్‌ను విడుదల చేసిం ది. సాఫ్ట్‌వేర్‌, ఈ-కామర్స్‌, ఐటీ ఆధారిత సేవలు, ఇండస్ట్రియల్‌ ఎలకా్ట్రనిక్స్‌, టెలి కాం రంగాలకు చెందిన కంపెనీల షేర్లతో ఈ సూచీని రూపొందించారు.

కొనసాగిన నష్టాలు: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ వరుసగా మూడో రోజూ నష్టాలతో ముగిసింది. అమ్మకాల ఒత్తిడితో సెన్సెక్స్‌ 166.33 పాయింట్ల నష్టంతో 58,117.09 వద్ద, 43.35 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 17,324.90 వద్ద ముగిశాయి. బుధవారం జరిగే అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ సమావేశం, ద్రవ్యోల్బణం, ఒమైక్రాన్‌  భయాలు మంగళవారమూ మార్కెట్‌ను వెంటాడాయు. 


దశాబ్ది గరిష్ఠానికి ద్రవ్యోల్బణం

దేశంలో టోకు ధరల ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) నవంబరులో దశాబ్ది గరిష్ఠ స్థాయి 14.23 శాతానికి దూసుకుపోయింది. మినరల్‌ ఆయిల్స్‌, బేసిక్‌ మెటల్స్‌, క్రూడ్‌ పెట్రోలియం, సహజ వాయువు ధరలు పెరగడం ఇందుకు కారణం. అలా గే ఆహార ద్రవ్యోల్బణం కూడా 3.06 శాతం నుంచి 6.70 శాతానికి దూసుకుపోయింది. ఇదిలా ఉండగా గత ఏప్రిల్‌ నుంచి మొదలై వరుసగా ఎనిమిది నెలలుగా డబ్ల్యూపీఐ రెండంకెల స్థాయిలోనే ఉంది.

Updated Date - 2021-12-15T09:26:53+05:30 IST