నిఫ్టీ@ 15,000

ABN , First Publish Date - 2021-02-06T06:22:01+05:30 IST

స్టాక్‌ మార్కెట్‌ వరుసగా ఐదో రోజూ లాభాల్లో ముగిసింది. ప్రామాణిక ఈక్విటీ సూచీలు సరికొత్త రికార్డులు సృష్టించాయి. శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్‌లో బీఎ్‌సఈ

నిఫ్టీ@ 15,000

 51,000 మైలురాయికి సెన్సెక్స్‌ 

ఈక్విటీ సూచీల సరికొత్త రికార్డు 


ముంబై: స్టాక్‌ మార్కెట్‌ వరుసగా ఐదో రోజూ లాభాల్లో ముగిసింది. ప్రామాణిక ఈక్విటీ సూచీలు సరికొత్త రికార్డులు సృష్టించాయి. శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్‌లో బీఎ్‌సఈ సెన్సెక్స్‌ 51,000, ఎస్‌ఎ్‌సఈ నిఫ్టీ 15,000 మైలురాయికి చేరాయి. సూచీలు ఈ స్థాయిలకు చేరడం మార్కెట్‌ చరిత్రలో ఇదే తొలిసారి. కానీ, ఆల్‌టైం రికార్డు స్థాయిల వద్ద నిలదొక్కుకోలేక సూచీలు మళ్లీ దిగివచ్చాయి. రోజంతా తీవ్ర ఊగిసలాటలకు లోనైనప్పటికీ చివరికి మోస్తరు లాభాలతో సరిపెట్టుకున్నాయి. సెన్సెక్స్‌ 117.34 పాయింట్లు పెరుగుదలతో 50,731.63 వద్ద ముగిసింది. నిఫ్టీ 28.60 పాయింట్ల లాభంతో 14,924.25 వద్ద స్థిరపడింది.


లాభాల వారం: ఈ వారంలో సెన్సెక్స్‌ 4,445.86 పాయింట్లు (9.60ు), నిఫ్టీ 1,289.65 పాయింట్లు(9.45ు) బలపడ్డాయి. 


నిఫ్టీ కీలక మైలురాళ్లు: నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ప్రామాణిక సూచీ నిఫ్టీ.. 1995లో 1,000 బేస్‌ పాయింట్లతో ప్రారంభమైంది. ఐటీ బూమ్‌తో 2000 సంవత్సరంలో 1,800 పాయింట్లకు చేరుకుంది. 


సరికొత్త  ఇంట్రాడే గరిష్ఠాలు 

సెన్సెక్స్‌ :  51,073.27

నిఫ్టీ   :   15,014.65


మైలురాయి తేదీ 

2,000 2004 డిసెంబరు 2

3,000 2006 జనవరి 30

4,000 2006 డిసెంబరు 1

5,000 2007 సెప్టెంబరు 27

6,000 2007 డిసెంబరు 11

7,000 2014 మే 12

8,000 2014 సెప్టెంబరు 1

9,000 2017 మార్చి 14

10,000 2017 జూలై 25

11,000 2018 జనవరి 23

12,000 2019 జూన్‌ 3

13,000 2020 నవంబరు 24

14,000 2021 జనవరి 1

15,000 ఫిబ్రవరి 5 (ఇంట్రాడే)


Updated Date - 2021-02-06T06:22:01+05:30 IST