స్టార్టప్‌ల కోసం యాప్‌స్కేల్ అకాడమీ
ABN , First Publish Date - 2021-10-28T08:17:05+05:30 IST
India Startup Upscale Academy

న్యూఢిల్లీ : భారత స్టార్టప్‌లకు అత్యున్నత నాణ్యత గల యాప్‌ల నిర్మాణంలో సహకరించేందుకు గూగుల్, కేంద్ర ఎలక్ర్టానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఉమ్మడిగా యాప్‌స్కేల్ అకాడమీని ప్రారంభించాయి. గేమింగ్, హెల్త్‌కేర్, ఫిన్‌టెక్, ఎడ్ టెక్ సహా వివిధ విభాగాల్లో ప్రపంచ శ్రేణి యాప్‌ల తయారీకి ఈ అకాడమీ సహాయ సహకారాలు అందచేస్తుంది. ఇందుకు దరఖాస్తులు అందించేందుకు చివరి తేదీ డిసెంబరు 15. వచ్చిన దరఖాస్తుల నుంచి 100 స్టార్టప్‌లను ఎంపిక చేసి అవసరమైన సహాయం అందిస్తారు.