వైరల్ అవుతున్న బెన్నీ దయాల్ ‘కూ పే బోలేగా’ క్రికెట్ సాంగ్

ABN , First Publish Date - 2021-10-31T07:00:07+05:30 IST

కొనసాగుతున్న క్రికెట్ అనుభవాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ‘కూ పే బోలేగా’ అంటూ ఓ ఉత్తేజకరమైన క్రికెట్ గీతాన్ని..

వైరల్ అవుతున్న బెన్నీ దయాల్ ‘కూ పే బోలేగా’ క్రికెట్ సాంగ్

న్యూఢిల్లీ: కొనసాగుతున్న క్రికెట్ అనుభవాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ‘కూ పే బోలేగా’ అంటూ ఓ ఉత్తేజకరమైన క్రికెట్ గీతాన్ని కూ(Koo) యాప్ ప్రారంభించింది. టీ20 ప్రపంచ కప్ 2021 సమయంలో టీమిండియా కోసం, జట్టును చీర్ చేసేందుకు ప్రముఖ గాయకుడు బెన్నీ దయాల్ కంపోజ్ చేసి, పాడిన హై-ఆక్టేన్ గీతం సోషల్ మీడియాలో అభిమానుల తెగ ట్రెండ్ అవుతోంది. ఈ సాంగ్‌ను ట్వీట్ చేసిన బెన్నీ దయాల్.. ‘‘క్రికెట్ ఫీవర్ ఉంది! మరోసారి, మెన్ ఇన్ బ్లూను ఉత్సాహపరిచేందుకు మేము మా టీవీ‌లకు అతుక్కుపోయాం. ‘అబ్ చాహే హార్ హో యా జీత్, పూర దేశ్ అప్నే ఛాంపియన్స్‌కే లియే #KooParBolega కూ గానా కే సాథ్. జోష్ కామ్ నా హో’’’ అని ట్వీట్ చేశారు. 


Updated Date - 2021-10-31T07:00:07+05:30 IST