హైదరాబాద్‌ విమానాశ్రయంలో కొత్త తరం కంటైనర్లు

ABN , First Publish Date - 2021-08-27T06:41:01+05:30 IST

జీఎంఆర్‌ గ్రూప్‌ నిర్వహణలోని హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరో అధునాతన సర్వీసు అందుబాటులోకి వచ్చింది.

హైదరాబాద్‌ విమానాశ్రయంలో కొత్త తరం కంటైనర్లు

ముంబై: జీఎంఆర్‌ గ్రూప్‌ నిర్వహణలోని హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరో అధునాతన సర్వీసు అందుబాటులోకి వచ్చింది. ఔషధాలు, వ్యాక్సిన్ల ఎగుమతికి అత్యంత ఉపయుక్తంగా ఉండే ఎన్విరోటైనర్‌ రిలై ఆర్‌ఎల్‌పీ కంటైనర్లను జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఎయిర్‌ కార్గో (జీహెచ్‌ఏసీ) అందుబాటులోకి  తీసుకువచ్చింది. ఈ కంటైనర్లలోని సరుకులను 170 గంటల పాటు నియంత్రిత ఉష్ణోగ్రతలో ఉంచవచ్చు. దీనికి తోడు ఈ కంటైనర్లలో సాధారణ కంటైనర్ల కంటే 50 స్థలం ఎక్కువగా అందుబాటులో ఉంటుంది. 

Updated Date - 2021-08-27T06:41:01+05:30 IST