ఎన్‌ఈఎస్‌ఎల్‌తో అనుసంధాన ప్రక్రియను పూర్తి
ABN , First Publish Date - 2021-10-25T07:29:14+05:30 IST
నేషనల్ ఈ-గవర్నెన్స్ సర్వీసెస్ లిమిటెడ్ (ఎన్‌ఈఎస్‌ఎల్)తో అనుసంధాన ప్రక్రియను పూర్తి చేసినట్లు డాక్యుమెంటేషన్ ఎగ్జిక్యూషన్..

నేషనల్ ఈ-గవర్నెన్స్ సర్వీసెస్ లిమిటెడ్ (ఎన్‌ఈఎస్‌ఎల్)తో అనుసంధాన ప్రక్రియను పూర్తి చేసినట్లు డాక్యుమెంటేషన్ ఎగ్జిక్యూషన్ ప్లాట్‌ఫామ్ లీగాలిటీ వెల్లడించింది. అనుసంధాన ప్రక్రియ పూర్తి కావటంతో దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల (ఎన్‌బీఎఫ్‌సీ)కు డెట్ డాక్యుమెంటేషన్ సేవలను డిజిటల్ రూపంలో అందించే అవకాశం లభించనుందని పేర్కొంది. కంపెనీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశంలోని 1000కి పైగా సంస్థలకు లీగాలిటీ డాక్యుమెంటేషన్ సేవలందిస్తోంది.