నాట్కో చేతికి అమెరికా కంపెనీ

ABN , First Publish Date - 2021-12-15T09:25:19+05:30 IST

నాట్కో చేతికి అమెరికా కంపెనీ

నాట్కో చేతికి అమెరికా కంపెనీ

రూ.135 కోట్లకు కొనుగోలు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అమెరికాకు చెందిన డాష్‌ ఫార్మాస్యూటికల్స్‌ ఎల్‌ఎల్‌సీని అనుబంధ కంపెనీ ద్వారా నాట్కో ఫార్మా సొంతం చేసుకోనుంది. న్యూజెర్సీకి చెందిన డాష్‌ ఫార్మా ఫార్ములేషన్ల విక్రయాలు, మార్కెటింగ్‌, పంపిణీలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2021, డిసెంబరుతో ముగిసే ఏడాదికి డాష్‌ ఫార్మా దాదాపు 1.5 కోట్ల డాలర్ల (దాదాపు రూ.122 కోట్ల) నికర అమ్మకాలను నమోదు చేసే వీలుందని నాట్కో ఫార్మా వెల్లడించింది. కంపెనీ పరిశీలన అనంతరం కొనుగోలు ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు తెలిపింది. డాష్‌ ఫార్మా కొనుగోలు ద్వారా అమెరికాలో కస్టమర్లతో నేరుగా వ్యాపార కార్యకలాపాలు చేయడానికి నాట్కోకు అవకాశం లభిస్తుంది. డాష్‌ ఫార్మా కొనుగోలు ప్రక్రియ వచ్చే ఏడాది  జనవరి చివరి నాటికి పూర్తయ్యే వీలుంది. అమెరికా కంపెనీలో 100 శాతం వాటాను 1.8 కోట్ల డాలర్లకు (దాదాపు రూ.135 కోట్లు) నాట్కో కొనుగోలు చేస్తుంది. 

Updated Date - 2021-12-15T09:25:19+05:30 IST