కరిగిన మెటల్స్ల్ట్., మెరిసిన ఐటీ...

ABN , First Publish Date - 2021-12-31T01:16:07+05:30 IST

మార్కెట్లు వీక్లీ, మంత్లీ..ఇయర్లీ ఎక్స్‌పైరీ నేపధ్యంలో ఫ్లాట్‌గా క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 17204 పాయింట్ల వద్ద, సెన్సెక్స్ 57794 పాయింట్ల వద్ద ముగిసాయి.

కరిగిన మెటల్స్ల్ట్., మెరిసిన ఐటీ...

ముంబై : మార్కెట్లు వీక్లీ, మంత్లీ..ఇయర్లీ ఎక్స్‌పైరీ నేపధ్యంలో ఫ్లాట్‌గా క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 17204 పాయింట్ల వద్ద, సెన్సెక్స్ 57794 పాయింట్ల వద్ద ముగిసాయి. నిఫ్టీ బ్యాంక్‌ది కూడా ఇదే పరిస్థితి. ఐటీ టెక్ షేర్లు మాత్రమే కాస్త లాభపడగా, ఆయిల్ అండ్ గ్యాస్ సరిసమానంగా నష్టపోయాయి. మిగిలిన అన్ని రంగాల షేర్లు కూడా ఓ రేంజ్ బౌండ్ ట్రేడ్‌లో నష్టపోయాయి.


నిఫ్టీ గెయినర్లలో... ఎన్‌టీపీసీ , హెచ్‌సీఎల్‌ టెక్, సిప్లా, ఇండస్ ఇండ్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్... మూడె నుంచి ఒకటిన్నర శాతం వరకు లాభపడగా, లూజర్లలో బజాజ్ ఆటో, రిలయన్స్, యూపీఎల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్... రెండు శాతం వరకు నష్టపోయాయి. మరోవైపు మార్కెట్లలో అనూహ్యమైన స్వింగ్ చోటు చేసుకుంది. నిఫ్టీ 120 పాయింట్లు పెరిగినట్లే పెరిగి, మళ్ళీ 70 పాయింట్లను కోల్పోవడం గమనార్హం.ఇక రేపు(శుక్రవారం... ఈ నెలకు, ఈ ఏడాదికి చివరి రోజు కావడంతో... ట్రేడింగ్ ఎలా జరగనుందన్న విషయమై ఆయా వర్గాల్లో ఆసక్తి నెలకొంది. 

Updated Date - 2021-12-31T01:16:07+05:30 IST