అమ్మకాల్లో దూసుకెళ్తున్న మెర్సిడెస్ బెంజ్ లగ్జరీ కార్లు..

ABN , First Publish Date - 2021-07-09T01:19:25+05:30 IST

అమ్మకాల్లో దూసుకెళ్తున్న మెర్సిడెస్ బెంజ్ లగ్జరీ కార్లు..

అమ్మకాల్లో దూసుకెళ్తున్న మెర్సిడెస్ బెంజ్ లగ్జరీ కార్లు..

న్యూఢిల్లీ: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఇండియా రికార్డు స్థాయిలో 65 శాతం వృద్ధిని సాధించింది. మెర్సిడెస్ బెంజ్ ఇండియా 2021 జూన్ నాటికి 50 శాతానికి పైగా అమ్మకాల వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. లక్ష్యానికంటే మించి వృద్ధి సాధించినట్లు సంస్థ పేర్కొంది. ప్రస్తుతం ఉన్న మరియు సరికొత్త మోడళ్ల డిమాండ్‌ను తీర్చడానికి ఉత్పత్తిని పెంచినట్లు మెర్సిడెస్ బెంజ్ ఇండియా వెల్లడించింది. 2020లో మొదటి ఆరు నెలల్లో అమ్మిన 2948 యూనిట్లతో పోలిస్తే 2021లో మొదటి ఆరు నెలల్లో 65 శాతం అమ్మకాల వృద్ధిని మెర్సిడెస్ బెంజ్ ఇండియా నమోదు చేసింది. దేశీయ మార్కెట్లో 4857 యూనిట్లను విక్రయించినట్లు మెర్సిడెస్ బెంజ్ ఇండియా ప్రకటించింది.

Updated Date - 2021-07-09T01:19:25+05:30 IST