ఖర్చు + 70-200 శాతం మార్జిన్ = కారు ధర...

ABN , First Publish Date - 2021-02-08T20:45:50+05:30 IST

ఖర్చు + 70-200 శాతం మార్జిన్ = కారు ధర...

ఖర్చు + 70-200 శాతం మార్జిన్ = కారు ధర...

ముంబై : ఒక కారు తయారీ ఖర్చుకు  70-200 శాతం మార్జిన్ ను కలుపుకుని కంపెనీలు విక్రయిస్తున్నాయంటే... ఆశ్చర్యం కలగక మానదు. ఈ వివరాలు మీకోసం... ఉదాహరణకు ఓ కారు తయారు చేయడానికి రూ. లక్ష ఖర్చవుతుందనుకుంటే... కంపెనీ మాత్రం దానిని రూ. 1.75-రూ. 2.75 లక్షల వరకు ధరతోొ విక్రయిస్తుంది. కంపెనీలు కారు విక్రయించడానికి 75 నుంచి 175-200 శాతం వరకు మార్జిన్ కలుపుకుంటాయి. కొన్ని సందర్భాల్లో మార్జిన్ 250 శాతంగా కూడా ఉండొచ్చు. ఎందుకంత ఎక్కువ రేటుకు కంపెనీలు కార్లను విక్రయిస్తాయంటే... కార్ల తయారీలో 60 శాతం స్టీల్ అవసరమవుతుందన్న విషయం తెలిసిందే. ఈ ధరల్లో ఒడిదుడుకులుంటాయి. అందుకే కంపెనీలు ఎక్కువ మార్జిన్ పెట్టుకుంటాయి.


ఇక కార్ల కంపెనీలు తమ కార్లను డీలర్ల వద్దకు చేర్చుతాయి. ఇక్కడ డీలర్లు కూడా కొంత మార్జిన్ కలుపుకొని కార్లను విక్రయిస్తుంటారు. దీంతో కారు ధర మరింత పెరుగుతుంది. కాగా... కొనుగోలుదారులు మరో విషయాన్ని గుర్తించాలి. కారు కొన్న తర్వాత ఆర్‌టీవో, బీమా, ఎక్స్‌ట్రా యాక్ససిరీస్ వంటి వాటికి అదనంగా మరింత ఖర్చు పెట్టుకోవాలి. అంటే... కార్ల కంపెనీలు, డీలర్లు, ప్రభుత్వం... ఎవరూ నష్టపోరు. భరించాల్సింది... కొనుగోలుదారుడే.


Updated Date - 2021-02-08T20:45:50+05:30 IST