లిఖిత ఇన్‌ఫ్రా లాభంలో 40% వృద్ధి

ABN , First Publish Date - 2021-02-05T05:52:39+05:30 IST

లిఖిత ఇన్‌ఫ్రా లాభంలో 40% వృద్ధి

లిఖిత ఇన్‌ఫ్రా లాభంలో 40% వృద్ధి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో లిఖిత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌  రూ.9.51 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.6.81 కోట్లతో పోలిస్తే 40 శాతం పెరిగింది. సమీక్షా త్రైమాసికంలో ఆదాయం రూ.39.5 కోట్ల నుంచి రూ.59.3 కోట్లకు చేరింది.


హెచ్‌పీసీఎల్‌ డిసెంబరు త్రైమాసికంలో  రూ.2354.64 కోట్ల లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో ఆర్జించిన లాభం రూ.747.20 కోట్లు. మూడో త్రైమాసికంలో రూ. 1323 కోట్ల ఇన్వెంటరీ లాభాలు సాధించినట్టు తెలిపింది.    

ఎన్‌టీపీసీ డిసెంబరు త్రైమాసికంలో  రూ.3876.36 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికరలాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో లాభం రూ.3351.28 కోట్లుగా ఉంది.  మొత్తం ఆదాయం రూ.28,387.27 కోట్లుగా ఉంది. కాగా రూ.10 విలువ గల ఒక్కో షేరుకు 30  శాతం డివిడెండ్‌ను బోర్డు సిఫారసు చేసింది. 

Updated Date - 2021-02-05T05:52:39+05:30 IST