ఎల్‌ఐసీలో చైర్మన్ పోస్ట్‌ను రద్దు చేసిన కేంద్రం!

ABN , First Publish Date - 2021-07-09T02:12:32+05:30 IST

ప్రభుత్వ బీమా సంస్థ‌ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో చైర్మన్ పోస్ట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ తాజాగా రద్దు చేసింది.

ఎల్‌ఐసీలో చైర్మన్ పోస్ట్‌ను రద్దు చేసిన కేంద్రం!

న్యూఢిల్లీ: ప్రభుత్వ బీమా సంస్థ‌ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో చైర్మన్ పోస్ట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా రద్దు చేసింది. ఈ పోస్ట్‌ స్థానంలో సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ పదవులను ఏర్పాటు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎల్‌ఐసీ ఐపీఓకు వెళ్లనున్న నేపథ్యంలో ఆర్థిక శాఖ ఈ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఎల్ఐసీ చట్టంలో ఆర్థిక శాఖ కొన్ని మార్పులు చేసింది. ఎల్‌ఐసీ లిస్టింగ్‌ కోసం ప్రభుత్వం ఇప్పటికే సంస్థ ఆథోరైజ్డ్ షేర్ క్యాపిటల్‌ను రూ. 25 వేల కోట్లకు పెంచేందుకు అంగీకరించింది. ఎల్‌ఐసీ లిస్టింగ్‌కు వీలు కల్పించేందుకు ఆర్థిక శాఖ సెక్యురిటీస్ కాంట్రాక్స్‌‌కు సంబంధించిన నిబంధనలను కూడా ఇటీవలే సవరించింది. 

Updated Date - 2021-07-09T02:12:32+05:30 IST