సత్తా చాటిన ఎల్‌ఐసీ పెన్షన్‌ విభాగం

ABN , First Publish Date - 2021-02-06T06:17:39+05:30 IST

ఎల్‌ఐసీ పెన్షన్‌ అండ్‌ గ్రూప్‌ పథకాల విభాగం మరోసారి తన సత్తా చాటింది. ప్రస్తుత

సత్తా చాటిన  ఎల్‌ఐసీ పెన్షన్‌ విభాగం

ఎల్‌ఐసీ పెన్షన్‌ అండ్‌ గ్రూప్‌ పథకాల విభాగం మరోసారి తన సత్తా చాటింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) ఏప్రిల్‌ నుంచి జనవరి వరకు అంటే పది నెలల కాలంలో ఈ విభాగం ఏకంగా రూ.లక్ష కోట్లకు పైగా ప్రీమియం ఆదాయం ఆర్జించింది. 2019 -20 ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ విభాగం ఆదా యం రూ.లక్ష కోట్లు అధిగమించటం విశేషం.


కాగా  ఎల్‌ఐసీకి చెందిన ఒక విభాగం వరుసగా రెండేళ్ల పాటు ఇలాంటి  రికార్డు సృష్టించడం ఇదే మొదటిసారి. కొవిడ్‌ నేపథ్యంలో మార్కెట్లో తీవ్ర పోటీ ఉన్నప్పటికీ ఎల్‌ఐసీ పెన్షన్‌ అండ్‌ గ్రూప్‌ పథకాల విభాగం ఈ రికార్డు సాధించటం విశేషం. ప్రస్తుతం ఈ విభాగం రూ.7 లక్షల కోట్ల నిధులను నిర్వహిస్తోంది. 


Updated Date - 2021-02-06T06:17:39+05:30 IST