ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్... చేదు ఫలితాలు

ABN , First Publish Date - 2021-10-23T12:54:40+05:30 IST

ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నికర లాభం సెప్టెంబరు త్రైమాసికంలో భారీగా తగ్గింది. ఏకంగా 68.7 శాతం క్షీణించి రూ. 247.86 కోట్లకు పడిపోయింది.

ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్... చేదు ఫలితాలు

ముంబై : ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నికర లాభం సెప్టెంబరు త్రైమాసికంలో భారీగా తగ్గింది. ఏకంగా 68.7 శాతం క్షీణించి రూ. 247.86 కోట్లకు పడిపోయింది. 2021 ఆర్ధిక సంవత్సరం రెండో త్రమాసికంలో రూ. 790.9 కోట్ల నికర లాభాన్ని కంపెనీ ప్రకటించింది. రెండో త్రైమాసికంలో వడ్డీ ఆదాయం తగ్గడం, వ్యయాలు గణనీయంగా పెరగడంతో చేదు ఫలితాలను చవిచూసింది.


రిపోర్టింగ్ త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం రూ. 1,238 కోట్ల నుంచి 5.25 శాతం తగ్గి, రూ. 1,173 కోట్లకు దిగివచ్చింది. కిందటి ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలోని నికర వడ్డీ మార్జిన్ 2.34 శాతం నుంచి కాస్త తగ్గి, 2.0 శాతానికి చేరింది. ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్స్‌పై వ్యయాలు ఏడాది క్రితమున్న రూ. 103.02 కోట్ల నుంచి భారీగా పెరిగి, రూ. 625.34 కోట్లకు చేరాయి. స్థూల నిరర్థక ఆస్తులు(జీఎన్‌పీఏలు) సెప్టెంబరు 2021 రెండో త్రైమాసికంలోని 2.79 శాతం నుంచి ప్రస్తుత 5.14 శాతానికి పెరిగాయి.

Updated Date - 2021-10-23T12:54:40+05:30 IST