లాక్‌డౌన్‌ హీరోలకు ఎల్‌ఐసీ సన్మానం

ABN , First Publish Date - 2021-02-06T06:16:50+05:30 IST

లాక్‌డౌన్‌ సమయంలో సాహసోపేతంగా వ్యవహరించిన సెంట్రల్‌ రైల్వే సిబ్బందిని భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) సన్మానించింది.

లాక్‌డౌన్‌ హీరోలకు ఎల్‌ఐసీ సన్మానం

లాక్‌డౌన్‌ సమయంలో సాహసోపేతంగా వ్యవహరించిన సెంట్రల్‌ రైల్వే సిబ్బందిని భారతీయ జీవిత బీమా సంస్థ  (ఎల్‌ఐసీ) సన్మానించింది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి అవసరమైన వస్తువులను రవాణా చేయడంలో వీరు చూపిన తెగువకు గుర్తింపుగా ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టెర్మినల్‌లో ఎల్‌ఐసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ విపిన్‌ ఆనంద్‌ వారిని ‘సర్టిఫికెట్స్‌ ఆఫ్‌ హానర్‌’తో సత్కరించారు.


సెంట్రల్‌ రైల్వేకి చెందిన పలువురు మోటార్‌మెన్‌, సాంకేతికి సిబ్బంది, సెక్యూరిటీ అధికారులు ఈ గౌరవ పురస్కారం అందుకున్నారు. ఎల్‌ఐసీ పశ్చిమ ప్రాంత జోనల్‌ మేనేజర్‌ వికాస్‌ రావు, కార్పొరేట్‌ కమ్యూనికేషన్స్‌ విభాగం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాజీవన్‌ నాయర్‌, సెంట్రల్‌ రైల్వే డీఆర్‌ఎం శలభ్‌ గోయెల్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-06T06:16:50+05:30 IST