చైనా ఫోన్లతో విసిగిపోయారా?.. వచ్చేసింది ‘లావా అగ్ని 5జి’

ABN , First Publish Date - 2021-11-10T01:25:17+05:30 IST

చైనా ఫోన్లతో విసిగిపోయిన వారికి, ఈసారి నయా స్మార్ట్‌ఫోన్ ట్రై చేయాలనుకునే వారికి ఇది శుభవార్తే. దేశీయ మొబైల్

చైనా ఫోన్లతో విసిగిపోయారా?.. వచ్చేసింది ‘లావా అగ్ని 5జి’

న్యూఢిల్లీ: చైనా ఫోన్లతో విసిగిపోయిన వారికి, ఈసారి నయా స్మార్ట్‌ఫోన్ ట్రై చేయాలనుకునే వారికి ఇది శుభవార్తే. దేశీయ మొబైల్ మేకర్ లావా ఇంటర్నేషనల్ అద్భుతమైన ఫీచర్లు, సరసమైన ధరతో 5జి ఫోన్‌ను ఈ రోజు (మంగళవారం) మార్కెట్లోకి విడుదల చేసింది.


‘లావా అగ్ని 5జి’ పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియా టెక్ డైమెన్సిటీ 810 చిప్‌సెట్ ఉపయోగించారు. క్వాడ్ రియర్ కెమెరా, 30 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ ప్రొటెక్షన్‌తో 90 హెర్ట్జ్ డిస్‌ప్లే, 64 మెగాపిక్సల్ కెమెరా సెన్సార్, 8 జీబీ ర్యామ్, 10 ప్రీలోడెడ్ కెమెరా ఫీచర్లు వంటివి ఉన్నాయి. రియల్‌మి 8ఎస్ 5జి, మోటో జి 5జి, శాంసంగ్ గెలాక్సీ ఎం32 5జి వంటి వాటికి ఇది గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. 


లావా అగ్ని 5జి ధర 

లావా అగ్ని 5జి 8జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజీ సింగిల్ వేరియంట్‌తో వస్తోంది. భారత్‌లో దీని ధర రూ. 19,999 మాత్రమే. ఈ నెల 18 నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ సెలర్లతోపాటు ఆఫ్‌లైన్ రిటైర్ల వద్దా అందుబాటులో ఉంటుంది. రూ. 500 చెల్లించి ప్రీబుకింగ్ కూడా చేసుకోవచ్చు. ఫలితంగా రూ. 2 వేల క్యాష్ బ్యాక్ లభించే అవకాశం కూడా ఉంది. 


లావా అగ్ని 5జి స్పెసిఫికేషన్లు: 

డ్యూయల్ సిమ్ (నానో), ఆండ్రాయిడ్ 11 ఓఎస్, 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, హోల్‌పంచ్ డిజైన్, ఆక్టాకోర్ మీడియా టెక్ డైమెన్సిటీ 810 ఎస్‌ఓసీ, 8 జీబీ ర్యామ్, 64 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో వెనకవైపు నాలుగు కెమెరాలు, ప్రీలోడెడ్ కెమెరాల మోడ్స్, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 128 జీబీ అంతర్గత స్టోరేజీ, 5జి, 4జి కనెక్టివిటీ, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ.Updated Date - 2021-11-10T01:25:17+05:30 IST