17% తగ్గిన లారస్‌ ల్యాబ్స్‌ లాభం

ABN , First Publish Date - 2021-10-29T08:55:47+05:30 IST

సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికంలో లారస్‌ ల్యాబ్స్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.202 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.

17% తగ్గిన లారస్‌ ల్యాబ్స్‌ లాభం

సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికంలో లారస్‌ ల్యాబ్స్‌ ఏకీకృత  ప్రాతిపదికన రూ.202 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలం (రూ.242 కోట్లు)తో పోల్చితే లాభం 17 శాతం క్షీణించింది. త్రైమాసిక సమీక్షాకాలంలో మొత్తం ఆదాయం 6 శాతం వృద్ధితో రూ.1,139 కోట్ల నుంచి రూ.1,203 కోట్లకు పెరిగింది.  


సీసీఎల్‌ లాభంలో స్వల్ప వృద్ధి 

ఏకీకృత ప్రాతిపదికన సీసీఎల్‌ ప్రొడక్ట్స్‌ రెండో త్రైమా సికానికి రూ.49.34 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడా ది క్రితం ఇదే కాలం లాభం రూ.47.46 కోట్లతో పోలిస్తే 4 శాతం పెరిగింది. ఆదాయం కూడా రూ.322.22 కోట్ల నుంచి రూ.336.82 కోట్లకు చేరింది. 


కోరమాండల్‌ లాభం రూ.519 కోట్లు

సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికానికి కోరమాండల్‌  ఇంటర్నేషనల్‌ లాభం రూ.519 కోట్లకు తగ్గింది. ఏడాది క్రితం ఇదే కాలంలో రూ.589 కోట్ల లాభాన్ని ప్రకటించింది. సమీక్షా కాలంలో ఆదాయం మాత్రం రూ.4,620 కోట్ల నుంచి రూ.6,166 కోట్లకు పెరిగింది. 

-హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌)

Updated Date - 2021-10-29T08:55:47+05:30 IST