ఎల్ అండ్ టీ... పెరుగుతోన్న రెవిన్యూ విజిబిలిటీ...

ABN , First Publish Date - 2021-11-09T07:57:00+05:30 IST

బలమైన ఆర్డర్ బుక్, లేబర్ లభ్యత పెరిగిన నేపధ్యంలో ఎల్ అండ్ టీ కోర్ ఇంజినీరింగ్, కన్‌స్ట్రక్షన్ బిజినెస్‌లో రెవెన్యూ విజిబులిటీ పెరుగుతోంది. దేశంలోనే అతి పెద్ద ఇంజినీరింగ్ కంపెనీ అయిన ఎల్ అండ్ టీ ఇన్‌పుట్ కాస్ట్స్‌ పెరుగుతున్నప్పటికీ మార్జిన్లలో మెరుగైన నంబర్లను ప్రదర్శించింది.

ఎల్ అండ్ టీ... పెరుగుతోన్న రెవిన్యూ విజిబిలిటీ...

ముంబై : బలమైన ఆర్డర్ బుక్, లేబర్ లభ్యత పెరిగిన నేపధ్యంలో ఎల్ అండ్ టీ కోర్ ఇంజినీరింగ్, కన్‌స్ట్రక్షన్ బిజినెస్‌లో రెవెన్యూ విజిబులిటీ పెరుగుతోంది. దేశంలోనే అతి పెద్ద ఇంజినీరింగ్ కంపెనీ అయిన ఎల్ అండ్ టీ  ఇన్‌పుట్ కాస్ట్స్‌ పెరుగుతున్నప్పటికీ మార్జిన్లలో మెరుగైన నంబర్లను ప్రదర్శించింది. కంపెనీ సైట్లలో, ఈ ఏడాది మే నెలలో ఉన్న 1.70 లక్షల మంది కార్మికుల సంఖ్య అక్టోబరు  నాటికి 2,51 లక్షలకు పెరిగింది. కార్మికుల లభ్యత పెరగడంతో, ఈ అండ్ సీ సెగ్మెంట్ ఎగ్జిక్యూషన్‌ రేట్‌ 2021-22 ఆర్ధిక సంవత్సరం 22 రెండో త్రైమాసికంలో, త్రైమాసికం ప్రాతిపదికన 27 % పెరుగుదల నమోదైంది. ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో ఈ అండ్ సీ ఆదాయం వరుసగా 18 %, 20 % పెరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తీున్నారు. 


పెరిగిన కమోడిటీ ఖర్చుల ప్రభావాన్ని తగ్గించే క్రమంలో... మరిన్ని ప్రాజెక్టులను లాభదాయక స్థాయికి తీసుకువచ్చేలా వేగవంతమైన ఎగ్జ్సిక్యూషన్‌పై ఎల్ అండ్ టీ దృష్టి సారించింది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విభాగంలో స్టీల్ వినియోగాన్ని రేషనలైజ్‌ చేసే క్రమంలో...  డిజైన్ మార్పులపై కూడా కసరత్తు చేస్తోంది. ఇవి ఫలితాలనిస్తున్నట్లు వినవస్తోంది. మొత్తం నిర్వహణ లాభంలో దాదాపు నాలుగింట ఒక వంతు వాటా ఉన్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్ మార్జిన్, సెప్టెంబరు త్రైమాసికంలోవార్షిక ప్రాతిపదికన 180 బేసిస్ పాయింట్లు పెరిగి 8.2 శాతానికి చేరింది.

Updated Date - 2021-11-09T07:57:00+05:30 IST