వినియోగదారులకు కూ యాప్ బంపర్ ఆఫర్

ABN , First Publish Date - 2021-10-31T06:52:45+05:30 IST

క్రికెట్ ఫీవర్ ఊపందుకోవడంతో, కూ యాప్ - భారతదేశ బహుళ-భాష మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫాం క్రికెట్ #SabseBadaStadiumలో..

వినియోగదారులకు కూ యాప్ బంపర్ ఆఫర్

న్యూఢిల్లీ: క్రికెట్ ఫీవర్ ఊపందుకోవడంతో, కూ యాప్ - భారతదేశ బహుళ-భాష మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫాం క్రికెట్ #SabseBadaStadiumలో జరిగే ‘కూ క్రియేటర్ కప్’ లో పాల్గొనడానికి కంటెంట్ క్రియటర్లను ఆహ్వానిస్తోంది. ఈ ఉత్తేజకరమైన కాంటెస్ట్‌ లో భాగంగా, ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2021లో మ్యాచ్‌లకు సంబంధించిన ఉల్లాసకరమైన మీమ్‌‌లు, ఫన్నీ కామెంట్లు, వీడియోలు లేదా రియల్ టైం #కూమెంటరీని షేర్ చేసి, ఆసక్తికరమైన బహుమతులను గెలుచుకోవడానికి కంటెంట్ క్రియటర్లను ప్రోత్సహిస్తుంది.

కూ క్రియేటర్ కప్‌లో పాల్గొనాలంటే వెంటనే కూ యాప్‌లో ఓ ఖాతా తెరిచి ఫాలోవర్లను పెంచుకోండి. క్రికెట్ జరుగుతున్న సమయంలో షేర్లు చేసి ఎక్కువమంది ఫాలోవర్లను పొందండి. అక్టోబరు 20 - నవంబర్ 20, 2021లో ఎక్కువ మంది ఫాలోవర్లను పొందిన కూ హ్యాండిల్ కూ క్రియేటర్ కప్ విజేతగా ప్రకటించడం జరుగుతుంది. అలాగే మాల్దీవుల ట్రిప్ లేదా మ్యాక్‌బుక్ ఎయిర్‌‌ని గెలుచుకునే అవకాశాన్ని కూడా కూ యాజమాన్యం కల్పించింది.

Updated Date - 2021-10-31T06:52:45+05:30 IST