నాబ్‌ఫిడ్ చైర్మన్‌గా కామత్
ABN , First Publish Date - 2021-10-28T08:07:38+05:30 IST
మౌలిక వసతుల రంగానికి నిధులు సమీకరించడానికి..

ముంబై/న్యూఢిల్లీ : మౌలిక వసతుల రంగానికి నిధులు సమీకరించడానికి ప్రభుత్వం ఇటీవల రూ.20 వేల కోట్లతో ఏర్పాటు చేసిన నేషనల్ బ్యాంక్ పర్ ఫైనాన్సింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవల్‌పమెంట్ (నాబ్‌ఫిడ్) చైర్మన్‌గా ప్రముఖ బ్యాంకర్ కెవీ కామత్‌ను (73) నియమించారు. కేవీగా అందరికీ సుపరిచితుడు, బ్యాంకింగ్ రంగంలో విశేష అనుభవం గల ఆయనను నాబ్‌ఫిడ్ చైర్మన్‌గా నియమించిన విషయం ఆర్థిక సర్వీసుల శాఖ ఒక ట్వీట్‌లో తెలియచేసింది.