ఆ వాహనాలు కొంటే... జనవరి 1 నుండి... ఉద్యోగులకు రూ. 3 లక్షల ఆఫర్...

ABN , First Publish Date - 2021-12-28T23:18:49+05:30 IST

కొత్త సంవత్సరం(2022)లో... జేఎస్‌డబ్ల్యూ గ్రూప్`తన ఉద్యోగులకు బంపరాఫర్‌ను ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి... విద్యుత్తు వాహనాలను కొనుగోలు చేసే తమ ఉద్యోగులకు రూ. 3 లక్షల వరకు ప్రోత్సాహకాలనందించనున్నట్లు వెల్లడించింది.

ఆ వాహనాలు కొంటే... జనవరి 1 నుండి... ఉద్యోగులకు రూ. 3 లక్షల ఆఫర్...

ముంబై : కొత్త సంవత్సరం(2022)లో... జేఎస్‌డబ్ల్యూ గ్రూప్`తన  ఉద్యోగులకు బంపరాఫర్‌ను ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి... విద్యుత్తు వాహనాలను కొనుగోలు చేసే తమ ఉద్యోగులకు రూ. 3 లక్షల వరకు ప్రోత్సాహకాలనందించనున్నట్లు వెల్లడించింది. హరిత ప్రోత్సాహకాల్లో భాగంగా తమ ఉద్యోగుల కోసం...  జేఎస్‌డబ్ల్యూ గ్రూప్... కొత్త ఈవీ విధానాన్ని ఆవిష్కరించింది. ఈ క్రమంలో... భారత్‌కు చెందిన నేషనల్లీ  డిటర్మిన్డ్ కాంట్రిబ్యూషన్స్, సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ సినారియోస్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ సంస్థలతో జత కట్టింది. మన దేశంలో ఓ


కార్పొరేట్ సంస్థ ఇలాంటి పథకాన్ని ప్రకటించడం ఇదే మొదటిసారి. ఇందులో భాగంగా... విద్యుత్తు ద్విచక్ర వాహనాలు, కార్లు కొనుగోలు చేసే జేఎస్‌డబ్ల్యూ ఉద్యోగులు... రూ. 3 లక్షల వరకు ప్రోత్సాహకాలను పొందవచ్చు. జేఎస్‌డబ్ల్యూ కార్యాలయాలు, ప్లాంట్లలోని  ఉద్యోగుల కోసం ఉచిత ఛార్జింగ్ స్టేషన్లు, ప్రత్యేక పార్కింగ్ స్లాట్లను కంపెనీ ఏర్పాటు చేయనుంది. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ...  మరో యాభై సంవత్సరాల(2070) నాటికి ‘జీరో కార్బన్ ఎమిషన్’ అనే భారత ప్రభుత్వం నిర్ణయానికణుగుణంగా తమ ఉద్యోగులకు ఇలాంటి తోడ్పాటునందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పాలసీ ద్వారా దేశంలో ఈవీ అడాప్షన్ పెరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే... ద్విచక్ర వాహనాలు కొంటే కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందా ? లేదా ? అన్న విషయమై మాత్రం స్పష్టత లేదు. 

Updated Date - 2021-12-28T23:18:49+05:30 IST