హైదరాబాద్‌లో జేపీ మోర్గాన్‌ కొత్త కార్యాలయం

ABN , First Publish Date - 2021-09-15T08:34:43+05:30 IST

జేపీ మోర్గాన్‌ హైదరాబాద్‌లోని సాలార్‌పురియా సత్వా నాలెడ్జ్‌ సిటీలో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది.

హైదరాబాద్‌లో జేపీ మోర్గాన్‌ కొత్త కార్యాలయం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): జేపీ మోర్గాన్‌ హైదరాబాద్‌లోని సాలార్‌పురియా సత్వా నాలెడ్జ్‌ సిటీలో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది. 8.22 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలం కలిగిన ఈ కొత్త క్యాంపస్‌ కంపెనీకి ఆసియా పసిఫిక్‌లోనే అతిపెద్దది. జేపీ మోర్గాన్‌ ఛేజ్‌కు టెక్నాలజీ, రిస్క్‌ ఆపరేషన్లు తదితరాలకు హైదరాబాద్‌లో కార్యాలయాలు ఉన్నాయి. ఇవన్నీ ఒక చోటుకు వస్తాయని, కొత్త కార్యాలయంలో మొత్తం కార్యకలాపాలు చేపడతామని జేపీ మోర్గాన్‌ ఛేజ్‌ చీఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ డేనియల్‌ విక్నెంగ్‌ తెలిపారు.  

Updated Date - 2021-09-15T08:34:43+05:30 IST