జోష్‌ తగ్గని హైదరాబాద్‌ రియల్టీ

ABN , First Publish Date - 2021-01-12T09:27:44+05:30 IST

కొవిడ్‌ నేపథ్యంలోనూ హైదరాబాద్‌ రియల్టీ మార్కెట్లో జోష్‌ తగ్గలేదు. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో నగరంలో ఎస్‌ఎ్‌ఫటీ సగటు ధర రూ.5,602 పలికింది.

జోష్‌ తగ్గని హైదరాబాద్‌ రియల్టీ

కొవిడ్‌ నేపథ్యంలోనూ హైదరాబాద్‌ రియల్టీ మార్కెట్లో జోష్‌ తగ్గలేదు. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో నగరంలో ఎస్‌ఎ్‌ఫటీ సగటు ధర రూ.5,602 పలికింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది 5 శాతం ఎక్కువ. 2019తో పోలిస్తే అమ్మకాలు మాత్రం 47 శాతం తగ్గి, 16,400 యూనిట్లకు పడిపోయాయి. గత ఏడాది జూలై-సెప్టెంబరు త్రైమాసికంతో పోలిస్తే మాత్రం డిసెంబరు త్రైమాసికంలో 99 శాతం పెరిగాయి. 2019 నాలుగో త్రైమాసికంతో పోల్చినా 13 శాతం వృద్ధి రేటు కనిపించింది. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కొత్త ప్రాజెక్టుల నిర్మాణం భారీగా పెరిగింది. అంతకు ముందు త్రైమాసికంతో పోలిస్తే ఈ విషయంలో 198 శాతం వృద్ధి రేటు కనిపించిది. 2019 సంవత్సరం నాలుగో త్రైమాసికంతో పోలిస్తే మాత్రం కొత్త యూనిట్ల నిర్మాణం 427 శాతం పెరిగింది. 

Updated Date - 2021-01-12T09:27:44+05:30 IST