జోస్‌ అలుక్కాస్‌ దీపావళి ఆఫర్లు

ABN , First Publish Date - 2021-10-29T08:53:54+05:30 IST

ప్రముఖ జువెలరీ గ్రూప్‌ అయిన జోస్‌ అలుక్కాస్‌.. దీపావళి పండగను పురస్కరించుకుని ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది.

జోస్‌ అలుక్కాస్‌ దీపావళి ఆఫర్లు

హైదరాబాద్‌: ప్రముఖ జువెలరీ గ్రూప్‌ అయిన జోస్‌ అలుక్కాస్‌.. దీపావళి పండగను పురస్కరించుకుని ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఆఫర్‌లో భాగంగా వినియోగదారులు ఆభరణాలు కొనుగోలు చేసినప్పుడు వెండి నాణేలను ఉచితంగా పొందవచ్చని తెలిపింది. అంతేకాకుండా వజ్రాభరణాలపై 25ువరకు, ప్లాటినం ఆభరణాలపై 7ు వరకు తగ్గింపును కూడా పొందవచ్చని జోస్‌ అలుక్కాస్‌ వెల్లడించింది. అలాగే కస్టమర్లు.. తమ పాత బంగారు ఆభరణాలను లేటెస్డ్‌ డిజైన్లలోని ధ్రువీకృత బంగా రు ఆభరణాలకు ఎక్స్ఛేంజ్‌ చేసుకోవచ్చని తెలిపింది. వివిధ ధరల శ్రేణిలో లభ్యమయ్యే ప్రత్యేక వజ్రాభరణాల కలెక్షన్స్‌పై డిస్కౌంట్స్‌ను అందుకోవచ్చని పేర్కొంది. కాగా తమ షోరూమ్‌ల్లో ఎంఎంటీసీ-పీఏఎంపీ బంగారు బిస్కెట్లను 5, 10, 20, 100 గ్రాముల్లో కొనుగోలు చేయవచ్చని తెలిపింది.

Updated Date - 2021-10-29T08:53:54+05:30 IST