ఐటెల్ నుంచి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్

ABN , First Publish Date - 2021-02-02T03:08:50+05:30 IST

చైనా మొబైల్ కంపెనీ ఐటెల్ భారత్‌లో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని పేరు ‘ఐటెల్ ఎ47’. 5.5 అంగుళాల

ఐటెల్ నుంచి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్

న్యూఢిల్లీ: చైనా మొబైల్ కంపెనీ ఐటెల్ భారత్‌లో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దీని పేరు ‘ఐటెల్ ఎ47’. 5.5 అంగుళాల హెచ్‌డీ ప్లస్ ఫుల్ స్క్రీన్ డిస్‌ప్లే, 3,020 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యూయల్ సెక్యూరిటీ ఫీచర్లు వంటి ముఖ్యమైన స్పెసిఫికేషన్లు ఉన్నాయి. కర్వ్‌డ్ ఎడ్జ్‌లు కలిగిన ఈ ఫోన్ కాస్మిక్ పర్పుల్, ఐస్ లేక్ బ్లూ కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంది.


స్మార్ట్‌ఫోన్‌కు మారాలనుకునే వారికి ఇది తగిన ఫోన్ అని కంపెనీ పేర్కొంది. రూ. 6 వేల లోపు స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూసే వారికి ఇది చక్కని ఆప్షన్.  ఐటెల్ ఎ47 ధర రూ. 5,499 మాత్రమే. అమెజాన్ ద్వారా ఈ నెల 5 నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. ఈఎంఐ ఆప్షన్లు కూడా ఉన్నాయి.  


ఐటెల్ ఎ47 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు: 5.5 అంగుళాల హెచ్‌డీ ప్లస్ ఫుల్ స్క్రీన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 9పై ఆపరేటింగ్ సిస్టం, 1.4జీహెచ్‌జడ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 32 జీబీ ఆన్‌బోర్డ్ మెమొరీ,  మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 32 జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు ఉంది. 5 ఎంపీతో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా, 3,020 ఎంఏహెచ్ బ్యాటరీ,  డ్యూయల్ సెక్యూరిటీ ఫీచర్లు, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్. 

Updated Date - 2021-02-02T03:08:50+05:30 IST