స్మిత్‌సోనియన్‌ మ్యూజియం ట్రస్టీగా ఇషా అంబానీ

ABN , First Publish Date - 2021-10-29T08:58:49+05:30 IST

దేశంలో జియో ఆవిర్భావానికి కీలక శక్తిగా నిలిచిన ఇషా అంబానీ వాషింగ్టన్‌ కేంద్రంగా పని చేస్తున్న స్మిత్‌సోనియన్‌ నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ ఏషియన్‌ ఆర్ట్‌ ట్రస్టీగా నియమితులయ్యారు.

స్మిత్‌సోనియన్‌ మ్యూజియం ట్రస్టీగా ఇషా అంబానీ

న్యూఢిల్లీ: దేశంలో జియో ఆవిర్భావానికి కీలక శక్తిగా నిలిచిన ఇషా అంబానీ వాషింగ్టన్‌ కేంద్రంగా పని చేస్తున్న స్మిత్‌సోనియన్‌ నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ ఏషియన్‌ ఆర్ట్‌ ట్రస్టీగా నియమితులయ్యారు. ఈ నెల 23 నుంచి ఈ నియామకం అమల్లోకి వచ్చింది. రాబోయే నాలుగేళ్ల పాటు ఇషా ట్రస్టీగా ఉంటారు. మొత్తం 17 మంది సభ్యులుండే ఆ బోర్డులో అమెరికా ప్రధాన న్యాయమూర్తి, అమెరికా ఉపాధ్యక్షురాలు, ముగ్గురు సెనేట్‌ సభ్యులు, ముగ్గురు హౌస్‌ ఆఫ్‌ రిప్రెజెంటేటివ్స్‌, 9 మంది పౌరులు సభ్యులుగా ఉంటారు. ప్రతిష్ఠాత్మకమైన వారి మధ్య ఇషా కూడా ఒక ట్రస్టీ కావడం విశేషం.

Updated Date - 2021-10-29T08:58:49+05:30 IST