క్రిప్టో... చట్టం సాధ్యమేనా ?
ABN , First Publish Date - 2021-11-27T00:29:07+05:30 IST
క్రిప్టో చట్టానికి సంబంధించి కేంద్రం ప్రకటన నేపధ్యంలో... క్రిప్టో మార్కెట్లో గందరగోళం నెలకొంది. ఇండియాలో సుమారు వంద మిలియన్ల క్రిప్టో పెట్టుబడిదారులు భయాందోళనలకు గురవుతున్నారు.

న్యూఢిల్లీ : క్రిప్టో చట్టానికి సంబంధించి కేంద్రం ప్రకటన నేపధ్యంలో... క్రిప్టో మార్కెట్లో గందరగోళం నెలకొంది. ఇండియాలో సుమారు వంద మిలియన్ల క్రిప్టో పెట్టుబడిదారులు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రకటన వెలువడిన మరుసటి రోజే... బాగా ప్రజాదరణ ఉన్న బిట్‌కాయిన్... దాదాపు 17 % మేర పడిపోయింది. ఇదిలా ఉంటే... క్రిప్టోకరెన్సీలకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అమలుకు నోచుకుంటుందా ? ఈ బిల్లు ద్వారా... క్రిప్టోను నిషేధించడం సాధ్యమేనా ? క్రిప్టో పెట్టుబడిదారులను కొత్త బిల్లు ఎలా ప్రభావితం చేస్తుంది ? తదితర అంశాలపై బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో... నిపుణులు ఏమంటున్నారంటే...
పబ్లిక్ క్రిప్టోకరెన్సీ అంటే లావాదేవీల సమాచారం పబ్లిక్‌గా అందుబాటులో ఉంటుంది. ఈ కారణంగా, వాటి నేపధ్యం తనిఖీ చేయవచ్చు. ప్రభుత్వం తీసుకురానున్న బిల్లులో... ప్రైవేటు ప్రభుత్వం కోరుకుంటే, అన్ని రకాల క్రిప్టోకరెన్సీలకు ప్రైవేట్ హోదా ఇవ్వవచ్చు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ కొత్త డిజిటల్ కరెన్సీని జారీ చేయవచ్చు. ఇది ప్రభుత్వం లేదా పబ్లిక్ క్రిప్టోకరెన్సీ అవుతుంది. ప్రభుత్వం ప్రైవేటు, పబ్లిక్ క్రిప్టోకరెన్సీలను వేరు చేయడం ద్వారా ప్రైవేటు క్రిప్టో కరెన్సీని పూర్తిగా నిషేధించవచ్చు . ప్రజల కోసం కొన్ని నియమాలు.. మరియు నిబంధనలను తీసుకురావాలి. ఏది ఏమైనప్పటికీ, మార్కెట్లో అంతగా ప్రైవేటు క్రిప్టోకరెన్సీలు లేవు. దీని కారణంగా మార్కెట్ పెద్దగా ప్రభావితం కాదని ఆర్ధికరంగ నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం క్రిప్టోను నియంత్రించవచ్చు. ఇక కొన్ని మామూలు నిబంధనల ద్వారా క్రిప్టోపై పన్నులు విధించవచ్చు. ప్రభుత్వం తన సొంత వాలెట్‌తో రావచ్చు. ఈ వాలెట్‌ను ఆర్బీఐ జారీ చేస్తుంది. ఈ క్రమంలో... క్రిప్టోకరెన్సీకి సంబంధించిన అన్ని లావాదేవీల రికార్డుల నినిర్వహణ సాధ్యపడుతుంది.
పూర్తి నియంత్రణ సాధ్యమేనా ?
ఏ ప్రభుత్వానికైనా నియంత్రణ చేయగలిగే అవకాశం, అధికారాలు తమ దేశానికి మాత్రమే పరిమితమై ఉంటాయి. కాగా... ఇంటర్నెట్ ప్రపంచంటో... ఏ సర్వర్ నుంచి అప్లోడ్ అవుతున్నాయో, ఎవరు అప్లోడ్ చేస్తున్నారో... అంత తేలికగా తెలిసే అంశాలు కావు. ఇక... క్రిప్టో ఎన్క్రిప్టెడ్ రూపంలో ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో దీనికి చాలా విలువ ఉంది. అందుకే ప్రభుత్వం దీన్ని పూర్తిగా నిషేధించలేదన్న అభిప్రాయాలున్నాయి.
క్రిప్టో ప్రత్యేకత ఏమిటంటే... ప్రభుత్వం లేదా బ్యాంకు లేదా ఏ ఒక్క వ్యక్తి దానిపై నియంత్రణ కలిగి ఉండడం సాధ్యపడదు. ఇక... క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీలు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. భారత ప్రభుత్వం చట్టం చేసినా, వాటి వల్ల పెద్దగా ఫలితముండకపోవచ్చన్న అభిప్రాయాలున్నాయి. మొత్తంమీద పూర్తిస్థాయిలో, ఓ సమగ్రమైన అధ్యయనం తర్వాతే... క్రిప్టో నిషేధంపై నిర్ణయం తీసుకోవాలన్న అభిప్రాయాలు వినవస్తున్నాయి.