జాగ్రతపడుతున్న ఇన్వెస్టర్లు... ఫ్లాట్ గా మార్కెట్లు...

ABN , First Publish Date - 2021-12-30T20:54:18+05:30 IST

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతోంది. డిసెంబరు నెల డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు నేటితో ముగియనున్న నేపధ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్త పడుతున్నారు.

జాగ్రతపడుతున్న ఇన్వెస్టర్లు... ఫ్లాట్ గా మార్కెట్లు...

ముంబై : దేశీయ స్టాక్‌ మార్కెట్‌ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతోంది. డిసెంబరు నెల డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు నేటితో ముగియనున్న నేపధ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్త పడుతున్నారు.  మిక్స్ డ్ ట్రేడింగ్ సంకేతాలు మన మార్కెట్ పై ప్రభావం చూపినట్లు గ్లోబల్ క్యూస్ కూడా పేర్కొంది. 9.50  గంటల సమయంలో సెన్సెక్స్‌ 70  పాయింట్ల లాభంతో 57,877వద్ద, నిఫ్టీ 142 పాయింట్ల లాభంతో 17227 వద్ద కొనసాగుతున్నాయి. ఆటో, ఆయిల్, రియల్టీ, పీఎస్‌యూ సూచీల్లో అమ్మకాలు జరుగుతుండగా... ఫార్మా, ఐటీ, లోహ రంగ సూచీలకు మాత్రం  కొనుగోళ్ల మద్దతు లభించింది. 

Updated Date - 2021-12-30T20:54:18+05:30 IST