వడ్డీ రేట్లు యధాతథం ? రేపు వెల్లడి కానున్న ఆర్‌బీఐ నిర్ణయం...

ABN , First Publish Date - 2021-10-08T01:50:16+05:30 IST

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచే అవకాశాలు ఉన్నట్లు వినవస్తోంది. ఆర్‌బీఐ ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష సమావేశం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆరుగురు సభ్యుల ఎంపీసీ తీసుకనే నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం వెల్లడించనున్నారు.

వడ్డీ రేట్లు యధాతథం ? రేపు వెల్లడి కానున్న ఆర్‌బీఐ నిర్ణయం...

ముంబై : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచే అవకాశాలు ఉన్నట్లు వినవస్తోంది. ఆర్‌బీఐ ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష సమావేశం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆరుగురు సభ్యుల ఎంపీసీ తీసుకనే నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం వెల్లడించనున్నారు. అంతర్జాతీయ కమోడిటీ ధరలు పెరుగుతున్న నేపధ్యంలో... దేశీయంగా ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టడమే లక్ష్యంగా నిర్ణయాలుంటాయని భావిస్తున్నారు.


ఈ నేపధ్యంలో వరుసగా ఎనిమిదోసారి ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లు యథాతథంగా ఉండవచ్చునని భావిస్తున్నారు. ప్రస్తుతం రెపో రేటు నాలుగు  శాతం, రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా ఉన్నాయి. ముడి చమురు, సహజవాయువు, బొగ్గు ధరలు ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతాయన్న విషయం తెలిసిందే. రేట్ల పెంపు ఉండకపోవచ్చునని,  భరించగలిగే స్థాయిలోనే ద్రవ్యోల్బణముండడం, టెన్ ఇయర్ బాండ్ ఈల్డ్స్ 6 శాతంపై కొనసాగుతుండడం ఇందుకు కారణమని భావిస్తున్నారు. ఆర్థిక రికవరీ సంకేతాలు కనిపిస్తున్నప్పటికీ ఆర్‌బీఐ వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించనున్నట్లు  వినవస్తోంది.ఏదేమైనప్పటికీ... ఆర్‌బీఐ శుక్రవారం ప్రకటించనున్న నిర్ణయాల కోసం ఆయా వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. 

Updated Date - 2021-10-08T01:50:16+05:30 IST