ఎల్‌ఐసీ డిజిటల్‌ కార్యకలాపాల విస్తరణ

ABN , First Publish Date - 2021-12-31T09:12:17+05:30 IST

భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ)..డిజిటల్‌ కార్యకలాపాల ను మరింతగా విస్తరించేందు కు గాను ప్రత్యేకంగా ఎల్‌ఐసీ డిజి జోన్‌ను ప్రారంభించింది.

ఎల్‌ఐసీ డిజిటల్‌ కార్యకలాపాల విస్తరణ

హైదరాబాద్‌: భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ)..డిజిటల్‌ కార్యకలాపాల ను మరింతగా విస్తరించేందు కు గాను ప్రత్యేకంగా ఎల్‌ఐసీ డిజి జోన్‌ను ప్రారంభించింది. డిజి జోన్‌తో వినియోగదారులు.. ఆన్‌లైన్‌లో పాలసీల కొనుగోలు, ప్రీమియం చెల్లింపులు, ఇతర సేవలను పొందవచ్చని తెలిపింది. ఎల్‌ఐసీ  మేనేజింగ్‌ డైరెక్టర్లు రాజ్‌ కుమార్‌, సిద్ధార్థ మొహంతి, బీసీ పట్నాయక్‌, వెస్ట్రన్‌ జోన్‌ జోనల్‌ మేనేజర్‌ వికాస్‌ రావు సమక్షంలో ఎల్‌ఐసీ చైర్‌పర్సన్‌ ఎంఆర్‌ కుమార్‌.. డిజి జోన్‌ను ప్రారంభించారు. ఎల్‌ఐసీ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేసిన ఈ కియో్‌స్కలతో వినియోగదారులు.. ఉత్పత్తులకు సంబంధించిన సమాచారంతో పాటు అన్ని రకాలైన సమాచారాన్ని అందించనుంది. వినియోగదారులకు సంస్థ సేవలను మరింత చేరువ చేసేందుకు డిజి జోన్‌ తోడ్పాటునందించనుందని ఎల్‌ఐసీ చైర్‌పర్సన్‌ కుమార్‌ అన్నారు. 

Updated Date - 2021-12-31T09:12:17+05:30 IST