5జీ వచ్చిన ఏడాదిలోనే భారత్‌లో 4కోట్ల మంది వినియోగదారులు!

ABN , First Publish Date - 2021-05-13T13:00:35+05:30 IST

ప్రస్తుతం మొబైల్ ప్రేమికులంతా ఎదరు చూస్తోంది 5జీ కోసమే. ఇది గనుక మార్కెట్లోకి వస్తే తొలి ఏడాదిలోనే భారత్‌లో 4 కోట్ల మంది వినియోగదారులు ఉంటారని ఎరిక్సన్ కంపెనీ అంచనా వేస్తోంది.

5జీ వచ్చిన ఏడాదిలోనే భారత్‌లో 4కోట్ల మంది వినియోగదారులు!

న్యూఢిల్లీ: ప్రస్తుతం మొబైల్ ప్రేమికులంతా ఎదరు చూస్తోంది 5జీ కోసమే. ఇది గనుక మార్కెట్లోకి వస్తే తొలి ఏడాదిలోనే భారత్‌లో 4 కోట్ల మంది వినియోగదారులు ఉంటారని ఎరిక్సన్ కంపెనీ అంచనా వేస్తోంది. ఈ మేరక తాజాగా ఈ కంపెనీ ఒక నివేదిక విడుదల చేసింది. ఈ కంపెనీ విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం, 5జీ కోసం కస్టమర్లు సాధారణం కన్నా 50శాతం అధికంగా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారట. డిజిటల్ సర్వీసులతో కలిపి ఉన్న 5జీ ప్లాన్లకు ఈ మాత్రం చెల్లించడానికి భారతీయ వినియోగదారులు రెడీగా ఉన్నట్లు ఈ నివేదికలో పేర్కొన్నారు. అయితే కేవలం 5జీ కనెక్టివిటీకి మాత్రమే అయిన పక్షంలో ప్రజలు అంత ఆసక్తి చూపడం లేదట. దీనికోసం కేవలం 10శాతం మాత్రమే అధికంగా చెల్లించడానికి సిద్ధపడుతున్నారని ఈ నివేదిక తెలుపుతోంది.

Updated Date - 2021-05-13T13:00:35+05:30 IST