‘కోవిడ్‌’లోనూ... ఆయన వేతనం రూ. 20.36 కోట్లు...

ABN , First Publish Date - 2021-05-22T01:13:29+05:30 IST

దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్) సీఈఓ, ఎండీ రాజేష్‌ గోపీనాథ్‌ 2020-21 లో అక్షరాలా రూ. 20.36 కోట్ల వేతనాన్ని తీసుకున్నాడు.

‘కోవిడ్‌’లోనూ... ఆయన వేతనం రూ. 20.36 కోట్లు...

ముంబై : దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్) సీఈఓ, ఎండీ రాజేష్‌ గోపీనాథ్‌ 2020-21 లో అక్షరాలా రూ. 20.36 కోట్ల వేతనాన్ని తీసుకున్నాడు. కంపెనీ వార్షిక నివేదికలో.ఈ వివరాలను పొందుపరచారు. వివరాలిలా ఉన్నాయి. కిందటి ఆర్ధిక సంవత్సరం(2020-21)లో రూ. 20.36 కోట్ల వేతనం తీసుకున్నట్లు కంపెనీ వార్షిక నివేదికలో పేర్కొంది.


కాగా... 2019-20 లో రూ. 13.3 కోట్లు. అయితే కోవిడ్‌ సమయంలో కూడా ఇంత వేతనాన్నందుకోవడం గమనార్హం. టీసీఎస్‌ నివేదిక ప్రకారం... 2020-21 లో గోపీనాథ్‌ రూ. 1.27 కోట్లను వేతనం రూపంలో, రూ. 2.09 కోట్లను అలవెన్స్‌ల రూపంలో, మరో రూ. 17 కోట్లను కమీషన్‌గా అందుకున్నాడు. ఇక ఇదే సమయంలో కంపెనీ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌(సీఈఓ) ఎన్ గణపతి సుబ్రమణియం రూ. 16 కోట్ల వేతనం అందుకున్నట్లు టీసీఎస్‌ పేర్కొంది. కాగా... అలవెన్స్‌ల రూపంలో ఆయన రూ. 1.88 కోట్లు, కమీషన్‌గా రూ. 13 కోట్లు తీసుకున్నట్లు వెల్లడించింది.


గత ఆర్థిక సంవత్సరం ఉన్నత స్థాయి అధికారుల వేతనం సగటున 55.22 శాతం పెరిగినట్లు కంపెనీ వార్షిక నివేదిక వెల్లడించింది. గత సంవత్సరం భారత్‌లోని సంస్థ ఉద్యోగులు 6.4 శాతం(ఇతర అలవెన్సులతో కలిపి), విదేశాల్లోని సిబ్బంది 2-6 శాతం వరకు వేతనాల్లో పెంపును పొందారు.

Updated Date - 2021-05-22T01:13:29+05:30 IST