ఏడాది క్రితం రూ. 5 లక్షలు పెడితే... ‘మైండ్’ ట్రీ బ్లోయింగ్...

ABN , First Publish Date - 2021-08-19T20:00:20+05:30 IST

స్టాక్ మార్కెట్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు నిజమే. కానీ... కంపెనీ స్ట్రాంగ్‌గా ఉంటే... దీర్ఘకాలంలో మంచి లాభాలొస్తాయి.

ఏడాది క్రితం రూ. 5 లక్షలు పెడితే... ‘మైండ్’ ట్రీ బ్లోయింగ్...

హైదరాబాద్ : స్టాక్ మార్కెట్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు నిజమే. కానీ... కంపెనీ స్ట్రాంగ్‌గా ఉంటే... దీర్ఘకాలంలో మంచి లాభాలొస్తాయి. అలాంటి స్టాక్‌ల్లో ఒకటి... ‘మైండ్ ట్రీ’. కంపెనీ స్టాక్ ప్రైస్ నిన్న(బుధవారం) మార్కెట్‌లో రూ. 3,195 వద్ద ముగిసిన విషయం తెలిసిందే. బీఎస్‌ఈలో మైండ్‌ట్రీ లిమిటెడ్ ఇండియా షేర్లు ఏడు శాతం పెరిగి రూ. 3,243 ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరుకోవడం గమనార్హం.   సరిగ్గా కిందటేడాది ఆగస్టు 19 దీని ధర రూ. 1,171.70 మాత్రమే. అంటే కంపెనీ షేరు ఏడాదిలో 172 శాతం పెరిగి రూ. 2,023.30 లకు పెరిగింది. ఇయర్ టు డేట్ చూసుకున్నా కూడా కంపెనీ షేరు 92.56 శాతం లాభపడి రూ. 1,535 లాభపడింది. ఆరు నెలల్లో స్టాక్ 90 శాతం వరకూ లాభపడడం గమనార్హం. ఇన్వెస్టర్లకు గడిచిన ఐదేళ్లలో కంపెనీ భారీ లాభాలనిచ్చింది.   ఏడాది క్రితం కూడా ఈ స్టాకుపై రూ. 5 లక్షలు పెట్టుబడి పెట్టినవాళ్లకు ఇప్పుడు రూ.14 లక్షలు దక్కనున్నాయి. 


Updated Date - 2021-08-19T20:00:20+05:30 IST