‘ఎలైట్ క్లబ్‌’లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్...

ABN , First Publish Date - 2021-09-04T00:40:04+05:30 IST

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ శుక్రవారం బీఎస్‌ఈలో రూ. 1 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్(మార్కెట్-క్యాప్) తో ఉన్న ఎలైట్ క్లబ్‌లో చేరింది.

‘ఎలైట్ క్లబ్‌’లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్...

ముంబై : ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ శుక్రవారం బీఎస్‌ఈలో రూ. 1 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్(మార్కెట్-క్యాప్) తో ఉన్న ఎలైట్ క్లబ్‌లో చేరింది. దాని షేరు ధర సరికొత్త గరిష్ట స్థాయి రూ. 708.20 కి చేరుకుంది. ఇంట్రా డే ట్రేడ్‌లో ఐదు శాతం ర్యాలీ చేసింది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్టాక్ ఇంతకుముందు... అంటే ఆగస్టు 18, 2021 న జీవితకాల గరిష్టస్థాయి రూ. 694.30 కి  చేరింది. తాజాగా ట్రిలియన్ మార్కెట్ క్యాప్ దాటిన మూడో బీమా కంపెనీగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ నిలిచింది.


హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ రూ. 1.49 ట్రిలియన్ మార్కెట్ క్యాప్‌తో అగ్రస్థానంలో ఉండగా, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ రూ. 1.23 ట్రిలియన్ మార్కెట్ క్యాప్‌తో రెండవ స్థానంలో ఉంది. ఇంట్రా-డే ట్రేడ్స్‌లలో తాజాగా ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ మార్కెట్ క్యాప్ రూ. 1.02 ట్రిలియన్లకు చేరుకుంది. ఉదయం 11:22 గంటలకు, స్టాక్ 2.6 శాతం పెరిగి రూ. 692.30 కి చేరుకుంది. బీఎస్ఈ డేటా ప్రకారం మార్కెట్ క్యాప్ రూ. 99,466 కోట్లకు చేరింది. ఎస్‌అండ్‌పీ బీఎస్ఈ సెన్సెక్స్ 0.01 శాతం పెరిగి 57,857 వద్ద ఉంది.

Updated Date - 2021-09-04T00:40:04+05:30 IST