మళ్ళీ... మల్టీ ఇయర్ ర్యాలీ... ఐసీఐసీఐ డైరెక్ట్

ABN , First Publish Date - 2021-12-30T22:16:50+05:30 IST

ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్‌లో బుల్లిష్ నడుస్తోంది. మల్టీ ఇయర్ బుల్లిష్ అనడంటో సందేహం లేదు. కిందటి(2020) సంవత్సరం నుంచి మార్కెట్‌లో ట్రేడింగ్ సానుకూల ధోరణితోనే వెళుతోంది.

మళ్ళీ... మల్టీ ఇయర్ ర్యాలీ... ఐసీఐసీఐ డైరెక్ట్

ముంబై : ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్‌లో బుల్లిష్ నడుస్తోంది. మల్టీ ఇయర్ బుల్లిష్ అనడంటో సందేహం లేదు. కిందటి(2020) సంవత్సరం నుంచి మార్కెట్‌లో ట్రేడింగ్ సానుకూల ధోరణితోనే వెళుతోంది. గడచిన పన్నెండు నెలల్లో... ఎన్‌ఎస్‌ఈ 500 లో 75 శాతం స్టాక్స్....  పాజిటివ్ లైన్‌లోనే ముగిసాయి. ఇది అరుదైన బుల్లిష్ అని ఐసీఐసీఐ డైరెక్ట్ పేర్కొంటోంది. ఇది మల్టీ ఇయర్ బుల్ మార్కెట్ కు నిదర్శనమంటోంది. గడిచిన రెండు దశాబ్ధాల్లో వచ్చిన మూడో మల్టీ ఇయర్ బుల్లిష్ ఇది. గతంలో... 2003, 2014 సంవత్సరాల్లో ఇలా జరిగింది.


మళ్లీ ప్రస్తుతం మార్కెట్‌లో ఈ ట్రెండ్ కనిపిస్తోంది. ప్రస్తుతం కొనసాగుతోన్న బుల్లిష్... ఇంకా కొనసాగుతుందని, అదే క్రమంలో... మరింత సుస్థిరమవుతుందని అంచనా వేస్తోంది బ్రోకరేజి సంస్థ. ప్రస్తుతం మల్టీ ఇయర్ బుల్లిష్ ట్రేండ్ చూస్తుంటే 43 నెలల వరకూ కొనసాగుతుందని అర్ధమవుతోంది. ప్రస్తుతం ఇన్వెస్టర్లు కూడా మీడియం అండ్ లాంగ్ టర్మ్ ఫోకస్ తో క్వాలిటీ షేర్లపై ద్రుష్టి పెట్టాలని సలహా ఇస్తోంది. గతంలో ఫెడ్ రేట్లు పెంచిన సందర్భాల్లో కూడా మల్టీ ఇయర్ ర్యాలీ కొనసాగింది. ఇప్పుడు కూడా అదే జరుగుతుందని కూడా ఐసీఐసీఐ డైరెక్ట్ చెబుతోంది. 

Updated Date - 2021-12-30T22:16:50+05:30 IST