హైదరాబాదీ కంపెనీ ఆల్‌టైమ్ రికార్డ్...

ABN , First Publish Date - 2021-10-08T21:46:53+05:30 IST

ప్రిసిషన్ ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ లీడింగ్ కంపెనీ ‘ఎంటీఏఆర్ టెక్నాలజీస్’ షేర్లు మార్కెట్‌లో దూసుకుపోతున్నాయి.

హైదరాబాదీ కంపెనీ ఆల్‌టైమ్ రికార్డ్...

హైదరాబా్ద్ : ప్రిసిషన్ ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ లీడింగ్ కంపెనీ ‘ఎంటీఏఆర్ టెక్నాలజీస్’ షేర్లు మార్కెట్‌లో  దూసుకుపోతున్నాయి. శుక్రవారం ఇంట్రాడేలో 11 శాతం లాభపడిన ఈ సంస్థ షేర్లు రూ. 1638.85 ధర దగ్గర ఆల్‌టైమ్ రికార్డ్ ప్రైస్‌ను క్రియేట్ చేశాయి. దీంతో జులై 16 న నమోదైన రూ. 1,562 ధర రికార్డు తుడిచిపెట్టుకుపోయింది మార్చి 15 న మార్కెట్లలో లిస్ట్ అయిన ఎంటార్ ‌షేర్లు ఎక్కడా తగ్గలేదు. ఇష్యూ ధర రూ. 575 తో పోల్చితే  ఈ ఏడు నెలల కాలంలో 185 శాతం పెరిగింది.  ఈ రోజు(శుక్రవారం)  ట్రేడింగ్‌లో ఎంటీఏఆర్ టెక్నాలజీస్ షేర్లు భారీ వాల్యూమ్స్ నమోదు కావడం మరో రికార్డు. ఏకంగా 12 లక్షల షేర్లు ఎన్ఎస్ఈ, బిఎస్ఈ కౌంటర్లలో ట్రేడ్ అయ్యాయి. గతంలో ఈ వాల్యూమ్స్ నాలుగు లక్షలకే పరిమితమయ్యేవని ఎక్స్ఛేంజీలసమాచారం వెల్లడిస్తోంది. మార్కెట్లలో ఈ బజ్‌కు కారణం... రెండు రోజుల క్రితం రేటింగ్ ఏజెన్సీ  క్రిసిల్, కంపెనీ లాంగ్ టర్మ్ బ్యాంక్ లోన్లకు బీబీబీ+/ పాజిటివ్  నుంచి  ఏ/స్టేబుల్ రేటింగ్‌కు అప్‌గ్రేడ్ చేసింది. షార్ట్‌టర్మ్ బ్యాంక్ ఫెసిలిటీలకు  ఏ2 నుంచి ఏ2+కు  మార్చింది. న్యూక్లియర్ సెక్టార్‌లో న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇస్రో, డీఆర్‌డీఓ వంటి కంపెనీలను తన క్లయింట్లుగా కలిగిన ఎంటీఏఆర్ టెక్నాలజీస్ హైదరాబాద్‌కు  చెందిన కంపెనీయే.  ప్రస్తుతం ఎంటీఏఆర్ టెక్నాలజీస్ షేర్లు 7.42శాతం లాభంతో  1589.35 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. 

Updated Date - 2021-10-08T21:46:53+05:30 IST