హైబ్రిడ్‌ పని

ABN , First Publish Date - 2021-03-22T05:58:31+05:30 IST

కరోనా అనంతర కాలంలో అధిక శాతం మంచి హైబ్రిడ్‌ పని విధానాన్ని మాత్రమే ఎంచుకుంటారని

హైబ్రిడ్‌ పని

  కరోనా అనంతర కాలంలో అధిక శాతం మంచి హైబ్రిడ్‌ పని విధానాన్ని మాత్రమే ఎంచుకుంటారని సర్వేలో తేలినట్టు స్టీల్‌కేస్‌ నివేదికలో తెలిపింది. ఉద్యోగుల్లో 72 శాతం ఈ విధానానికి మొగ్గు చూపగా మేనేజర్‌ హోదాలోని వారిలో 83 శాతం మంది తమ టీమ్‌కు ఇదే విధానం అమలుపచనున్నట్టు చెప్పారు.


 లాక్‌డౌన్‌ అనంతర కాలంలో హైదరాబాద్‌ వాహన కొనుగోలుదారుల్లో లీజింగ్‌ విధానం 386 శాతం పెరిగినట్లు ఓటో క్యాపిటల్‌ తెలిపింది. 45 మందికి పైగా ఆటోమొబైల్‌ డీలర్లు తమతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు తెలియచేసింది.


 కొవిడ్‌ అనేక కుటుంబాలను అప్పుల పాలు చేసింది. ఫలితంగా  సెప్టెంబరు, 2020 నాటికి  కుటుంబాల అప్పుల వాటా జీడీపీలో 37.1 శాతానికి చేరింది.


Updated Date - 2021-03-22T05:58:31+05:30 IST