హెచ్‌యూఎల్ ‘షేర్’

ABN , First Publish Date - 2021-08-20T22:15:03+05:30 IST

పెట్టుబడిదారులు డిఫెన్సివ్ స్టాక్‌లను ఎంచుకున్న నేపధ్యంలో... శుక్రవారం ఇంట్రా-డే ట్రేడ్‌లో బీఎస్‌ఈలో హిందుస్థాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్) షేర్లు 52 వారాల గరిష్ఠ స్థాయి(రూ. 2,549.50)కి చేరాయి.

హెచ్‌యూఎల్ ‘షేర్’

ముంబై : పెట్టుబడిదారులు డిఫెన్సివ్ స్టాక్‌లను ఎంచుకున్న నేపధ్యంలో... శుక్రవారం ఇంట్రా-డే ట్రేడ్‌లో బీఎస్‌ఈలో హిందుస్థాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్) షేర్లు 52 వారాల గరిష్ఠ స్థాయి(రూ. 2,549.50)కి చేరాయి. ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్(ఎఫ్‌ఎంసీజీ) కంపెనీ స్టాక్ వరుసగా ఏడవ రోజు కూడా లాభాల్లో ట్రేడవుతోంది. ఎస్‌అండ్‌పీ బీఎస్ఈ సెన్సెక్స్ 0.67 శాతం క్షీణించి, 55,251 పాయింట్లకు చేరింది. ఈ ఏడాది జూన్ 22 న... గతంలోని గరిష్టం రూ. 2,531.50 ను కంపెనీ అధిగమించింది.


గతేడాది ఏప్రిల్ నుంచి కంపెనీ అత్యధిక స్థాయిలో ట్రేడ్ అవుతూ వస్తోంది. ఏప్రిల్ 8 న ఆల్ టైమ్ హై రూ. 2,164 ను తాకింది. గత ఏడు ట్రేడింగ్ రోజుల్లో ఎస్‌అండ్‌పీ బీఎస్ఈ సెన్సెక్స్‌లో 1.5 శాతం పెరగగా, ఎస్అండ్‌పీ బీఎస్ఈ ఎఫ్ఎమ్‌సీజీ సూచీలో 2.8 శాతం లాభంతో హెచ్‌యూఎల్ స్టాక్ 7 శాతం పుంజుకుంది. ఏప్రిల్-జూన్ 2021 త్రైమాసికానికి హెచ్‌యూఎల్ యొక్క ఆరోగ్యం, పరిశుభ్రత, పోషకాహార పోర్ట్‌ఫోలియో మంచి వృద్ధిని (వార్షికంగా 8 శాతం) కొనసాగించడం విశేషం. 

Updated Date - 2021-08-20T22:15:03+05:30 IST