ఫర్లిలైజర్ స్టాక్స్‌కు సబ్సిడీని కంపెనీలు ఏమేరకు అమలు చేస్తాయి ?

ABN , First Publish Date - 2021-05-21T01:24:51+05:30 IST

మార్కెట్లలో ఫర్టిలైజర్ స్టాక్స్‌కు సానుకూల వాతావరణం కనిపించింది. దాదాపు 9 శాతం పెరిగి ఇన్వెస్టర్లు, ట్రేడర్లకు మంచి లాభాలు తెచ్చిపెట్టాయి.

ఫర్లిలైజర్ స్టాక్స్‌కు సబ్సిడీని కంపెనీలు ఏమేరకు అమలు చేస్తాయి ?

హైదరాబాద్ : మార్కెట్లలో ఫర్టిలైజర్ స్టాక్స్‌కు సానుకూల వాతావరణం కనిపించింది. దాదాపు 9 శాతం పెరిగి ఇన్వెస్టర్లు,  ట్రేడర్లకు మంచి లాభాలు తెచ్చిపెట్టాయి. కేంద్రప్రభుత్వం డై అమ్మోనియా ఫాస్ఫేట్ ఎరువులపై సబ్సిడీని 140 శాతం మేర పెంచింది. అంటే ఒక్కో బ్యాగ్‌పై రూ. 500-రూ. 1,200 వరకూ సబ్సిడీ పెంచుతూ నిర్ణయం ప్రకటించింది. దీంతో ఎరువుల కంపెనీలకు భారీగా మార్జిన్లు మిగలడం  ఖాయంగా కనిపిస్తోంది. ఈ సబ్సిడీని వినియోగదారులకు కంపెనీలు బదిలీ చేసే అవకాశాలు  తక్కువగా ఉండడమే ఇందుకు కారణమని బ్రోకరేజ్ సంస్థలు భావిస్తున్నాయి. 


కేంద్రం ఇచ్చిన సబ్సిడీ ప్రకారం డిఏపి ఎరువుల బ్యాగ్ రూ. 2,400 ఉంటే, మార్కెట్లలో రూ. 1,200కు తగ్గనుంది. ఈ మొత్తం సబ్సిడీల విలువ రూ. 1,4775 ఉంటుందని అంచనా. కాగా... ఈ మొత్తం భారాన్ని కేంద్రమే భరించనుంది. గత కొద్ది నెలలుగా ఎరువుల కంపెనీలు ఇఫ్కో సహా  డిఏపి రేట్లను పెంచిన విషయం తెలిసిందే.  అంతర్జాతీయంగా... ఫాస్పారిక్ యాసిడ్, అమ్మోనియా ధరలు పెరగడంతో తలెత్తిన పరిణామంగా ఈ అంశాన్ని కంపెనీలు పేర్కొంటున్నాయి. ప్రతీ ఏటా డీఏపీ అమ్మకాలు భారత్‌లో పది మిలియన్ టన్నులుంటుందని అంచనా. వాటిలో సగం దేశంలో వినియోగమవుతుండగా, సగం ఎగుమతి అవుతుంటాయి. ప్రస్తుతం సబ్సిడీతో ధరల తగ్గింపు రైతులకు లాభం చేకూర్చే పరిణామం కాగా, కంపెనీలు దానిని ఏ మేరకు అమలు చేస్తాయనేది సందేహమేనని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తన నివేదికలో అభిప్రాయపడింది. 

Updated Date - 2021-05-21T01:24:51+05:30 IST