హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు అప్‌

ABN , First Publish Date - 2021-12-28T06:05:15+05:30 IST

హైదరాబాద్‌ నివాస గృహాల ధర ల్లో పెరుగుదల కనిపిస్తోంది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 2021 సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో హైదరాబాద్‌లో ఇళ్ల ధర లు 2.5 శాతం పెరిగాయి....

హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు అప్‌

న్యూఢిల్లీ: హైదరాబాద్‌ నివాస గృహాల ధర ల్లో పెరుగుదల కనిపిస్తోంది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 2021 సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో హైదరాబాద్‌లో ఇళ్ల ధర లు 2.5 శాతం పెరిగాయి. దేశంలో మరే నగరంలోనూ ఇళ్ల ధరలు ఈ స్థాయిలో పెరగలేదని రియల్టీ కన్సల్టెన్సీ సంస్థ ‘నైట్‌ఫ్రాంక్‌ ఇండి యా తన తాజా గ్లోబల్‌ రెసిడెన్షియల్‌ సిటీస్‌ ఇండెక్స్‌లో తెలిపింది. ఇందుకోసం ఈ సంస్థ ప్రపంచంలోని 150 ప్రధాన నగరాలను పరిశీలించి ఈ ఇండెక్స్‌ రూపొందించింది. ఈ సూచీ ప్రకారం ధరల పెరుగుదల్లో హైదరాబాద్‌.. ప్రపంచంలో 128వ స్థానంలో ఉంది. హైదరాబాద్‌ తర్వాత చెన్నై (131), కోల్‌కతా (135), అహ్మదాబాద్‌ (139) స్థానాల్లో నిలిచాయి.

Updated Date - 2021-12-28T06:05:15+05:30 IST