హాస్పిటల్స్‌పై నియంత్రణ కావాలి : ఐఆర్‌డీఏఐ

ABN , First Publish Date - 2021-12-07T06:07:29+05:30 IST

ఆసుపత్రులపైనా తమకు నియంత్రణ కావాలని భారత బీమా నియంత్రణ, అభవృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) ప్రభుత్వాన్ని కోరింది.

హాస్పిటల్స్‌పై నియంత్రణ కావాలి : ఐఆర్‌డీఏఐ

న్యూఢిల్లీ : ఆసుపత్రులపైనా తమకు నియంత్రణ కావాలని భారత బీమా నియంత్రణ, అభవృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) ప్రభుత్వాన్ని కోరింది. లేదా ఆస్పత్రుల నియంత్రణ కోసం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని ఐఆర్‌డీఏఐ సభ్యురాలు టీఎల్‌ అలమేలు కోరారు. కొవిడ్‌ నేపథ్యంలో కొన్ని ఆస్పత్రులు ఆరోగ్య బీమా ఉన్న వ్యక్తులకు నగదు రహిత వైద్యాన్ని తిరస్కరించడం, అడ్డగోలుగా రేట్లు పెంచేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. వీటికి చెక్‌ పెట్టాలంటే ఆస్పత్రులపైనా ఎవరో ఒకరికి నియంత్రణ ఉండాలన్నారు. లేకపోతే ప్రజలకు ఆరోగ్య బీమాపై నమ్మకం పోయే ప్రమాదం ఉందన్నారు. ప్రస్తుతం తమకు బీమా సంస్థలపై తప్ప ఆస్పత్రులపై ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో అనేక సమస్యలు ఎదురవుతున్నట్టు అలమేలు చెప్పారు. 

Updated Date - 2021-12-07T06:07:29+05:30 IST