హిందాల్కో డివిడెండ్ షేరుకు రూ. 3 ...

ABN , First Publish Date - 2021-05-22T02:00:20+05:30 IST

హిందాల్కో... కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్‌లో 189 శాతం వృద్ధితో రూ. 1928కోట్ల లాభాన్ని ప్రకటించింది. ఈ క్రమంలో... ఒక్కో షేరుకు రూ. 3 డివిడెండ్ ప్రకటించింది.

హిందాల్కో డివిడెండ్ షేరుకు రూ. 3 ...

ముంబై : హిందాల్కో... కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్‌లో 189 శాతం వృద్ధితో రూ. 1928కోట్ల లాభాన్ని  ప్రకటించింది. ఈ క్రమంలో... ఒక్కో షేరుకు  రూ. 3 డివిడెండ్ ప్రకటించింది. కాగా... కంపెనీ నిర్వహణ ఆదాయం కూడా 38 శాతం పెరిగి రూ. 40,507 కోట్లకు చేరింది. ఫలితాల ప్రకటన సందర్భంగా హిందాల్కో తన షేరు హోల్డర్లకు షేరుకు రూ. 3 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. 


కాగా... ఇండియా వ్యాపారం రికార్డు స్థాయిలో రూ. 635 కోట్లకు ఎగసిందని, ఇందుకు 92 వేల టన్నుల అల్యూమినియం అమ్మకాలు జరగడమే కారణమని కంపెనీ వెల్లడించింది. ఇండియాలో ఈ ఒక్క వ్యాపారంతోనే రూ. 1610 కోట్ల ఆపరేటింగ్ ప్రాఫిట్‌ను సాధించినట్లు హిందాల్కో వెల్లడించింది. కాగా... ఈ క్వార్టర్‌కు సంబంధించినంత వరకూ ... హిందాల్కో తన మొత్తం అప్పులను రూ. 1,8187 కోట్లకు తగ్గించుకున్నట్లు ప్రకటించడం గమనార్హం. 

Updated Date - 2021-05-22T02:00:20+05:30 IST