హెరిటేజ్‌ ఫుడ్స్‌ 100% డివిడెండ్‌

ABN , First Publish Date - 2021-05-20T05:55:15+05:30 IST

గత ఆర్థిక సంవత్సరానికి హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఆదా యం తగ్గినప్పటికీ వాటాదారులకు నూరు శాతం తుది డివిడెండ్‌ను ప్రకటించింది

హెరిటేజ్‌ ఫుడ్స్‌ 100% డివిడెండ్‌

త్రైమాసిక లాభం రూ.24 కోట్లు


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): గత ఆర్థిక సంవత్సరానికి హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఆదా యం తగ్గినప్పటికీ  వాటాదారులకు నూరు శాతం తుది డివిడెండ్‌ను ప్రకటించింది. రూ.5 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.5 డివిడెండ్‌ ను బోర్డు సిఫారసు చేసిందని కంపెనీ వెల్లడించింది. 2020-21 చివరి త్రైమాసికానికి నష్టాల నుంచి కంపెనీ లాభాల్లోకి వచ్చింది. ఈ ఏడాది మార్చితో ముగిసిన మూడు నెలలకు రూ.24.4 కోట్ల ఏకీకృత లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.210 కోట్ల నష్టం చవి చూ సింది. ఆదాయం రూ.652.6 కోట్ల నుంచి రూ.619.4 కోట్లకు తగ్గిందని ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ బ్రహ్మణి నారా తెలిపారు. ఈ కాలంలో మొత్తం ఆదాయంలో విలువ జోడించిన ఉత్పత్తుల ఆదాయం వాటా 26.6 శాతం ఉన్నట్లు చెప్పారు.

Updated Date - 2021-05-20T05:55:15+05:30 IST