పది నిమిషాల్లో రూ. 850 కోట్లు సంపాదించాడు

ABN , First Publish Date - 2021-10-08T02:38:18+05:30 IST

షేర్ ట్రేడింగ్ బిజినెస్‌లో నిష్ణాతుడు రాకేష్ ఝన్‌ఝన్‌వాలా... కేవలం పది నిమిషాల్లో రూ. 850 కోట్లు సంపాదించాడు. ఆశ్చర్యంగా ఉన్నా... ఇది నిజం.

పది నిమిషాల్లో రూ. 850 కోట్లు సంపాదించాడు

 ముంబై : షేర్ ట్రేడింగ్ బిజినెస్‌లో నిష్ణాతుడు రాకేష్ ఝన్‌ఝన్‌వాలా... కేవలం పది నిమిషాల్లో రూ. 850 కోట్లు సంపాదించాడు. ఆశ్చర్యంగా ఉన్నా... ఇది నిజం. ఏస్ ఇన్వెస్టర్ పెట్టుబడుల్లోని అతి పెద్ద స్టాక్ బెట్‌ టైటాన్, ఈ రోజు‍(గురువారం) ట్రేడింగ్‌లో మెరిసిపోయింది. దాదాపు 10 % ర్యాలీ చేసింది. ఈ క్రమంలో... కేవలం పదంటే పది  నిమిషాల్లోనే మార్కెట్ క్యాపిటల్‌కు మరో రూ. 17,770 కోట్లను ఈ కంపెనీ జోడించింది. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే టైటాన్ షేర్లు 9.32 % పెరిగి, రికార్డు స్థాయి(రూ. 2,347)కి చేరుకున్నాయి.


ఈ టాటా గ్రూపు కంపెనీలో ఝున్‌ఝున్‌వాలాకు, ఆయన భార్యకు కలిపి 4.81 % వాటా ఉంది. ఇప్పుడా వాటా విలువ రూ. 854 కోట్ల మేర పెరిగింది. ఇంట్రాడేలో రూ. 2,08,350 కోట్ల మార్కెట్‌ క్యాపిటల్‌కు టైటాన్ చేరుకోగా, బిగ్‌ బుల్‌ వాటా రూ. 10 వేల కోట్ల పైకి చేరింది. సెకండ్‌ వేవ్‌ తర్వాత, కస్టమర్ల డిమాండ్‌లో టైటాన్‌ బలమైన రికవరీని చూసింది. చాలా వ్యాపారాలు ప్రి-కొవిడ్‌ స్థాయులను అధిగమించాయి, లేదా, ఆ స్థాయులకు దగ్గరగా ఉన్నాయి. కిందటి త్రైమాసికంలో మరో 13 స్టోర్లను పెంచి, మొత్తం స్టోర్ల సంఖ్యను 414కు చేర్చామని, ఈ క్రమంలో కంపెనీ గ్రోత్‌ 78% పెరిగిందని, నిన్నటి మార్కెట్‌ తర్వాత టైటాన్‌ ప్రకటించింది. వాచ్‌లు, వేరబుల్స్‌ సెగ్మెంట్స్‌లో 74 % రికవరీ, కళ్లజోళ్ల సెగ్మెంట్‌లో 74 % వృద్ధి ఉందని, ఇతర వ్యాపారాలు 121 % వృద్ధిని నమోదు చేశాయని బీఎస్‌ఈ ఫైలింగ్‌లో కంపెనీ పేర్కొంది. 


Updated Date - 2021-10-08T02:38:18+05:30 IST