ఎలక్ట్రానిక్‌ రసీదులతో గోల్డ్‌ ట్రేడింగ్‌

ABN , First Publish Date - 2021-05-18T06:10:51+05:30 IST

దేశంలో గోల్డ్‌ ఎక్స్ఛేంజ్‌ ఏర్పాటు కోసం మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ సమగ్ర విధివిధానాలను ప్రతిపాదించింది. ఈ ఎక్స్ఛేంజ్‌లో ఎలక్ట్రానిక్‌ రసీదు రూపంలో బంగారం ట్రేడింగ్‌ జరపాలని సూచించింది

ఎలక్ట్రానిక్‌ రసీదులతో గోల్డ్‌ ట్రేడింగ్‌

గోల్డ్‌ ఎక్స్ఛేంజ్‌ ఏర్పాటుకు విధివిధానాలు ప్రతిపాదించిన సెబీ 


ముంబై: దేశంలో గోల్డ్‌ ఎక్స్ఛేంజ్‌ ఏర్పాటు కోసం మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ సమగ్ర విధివిధానాలను ప్రతిపాదించింది. ఈ ఎక్స్ఛేంజ్‌లో ఎలక్ట్రానిక్‌ రసీదు రూపంలో బంగారం ట్రేడింగ్‌ జరపాలని సూచించింది. దేశీయంగా రోజువారీ స్పాట్‌ ధర నిర్ణయంలో పారదర్శకతకు ఇది దోహదపడుతుందని సెబీ పేర్కొంది. కిలో, 100 గ్రాములు, 50 గ్రాములతోపాటు షరతులకు లోబడి 10, 5 గ్రాము సైజుల్లో ఎలక్ట్రానిక్‌ గోల్డ్‌ రిసీట్స్‌ (ఈజీఆర్‌) జారీ చేయవచ్చంటోంది. గోల్డ్‌ ఎక్స్ఛేంజ్‌ ఏర్పాటుకు సంబంధించి చర్చా పత్రాన్ని విడుదల చేయడంతో పాటు వాల్ట్‌ మేనేజర్లకు ముసాయిదా మార్గదర్శకాలనూ విడుదల చేసింది. బంగారు లోహాన్ని నిర్వహించే ఈ సంస్థలు సెబీ వద్ద ఇంటర్మీడియేటరీలుగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. 

Updated Date - 2021-05-18T06:10:51+05:30 IST